Begin typing your search above and press return to search.

ప‌వ‌ర్ స్టార్ వ‌ర్సెస్ క‌లెక్ష‌న్ కింగ్! ముందుంది ముస‌ళ్ల పండ‌గ‌!!

By:  Tupaki Desk   |   26 Sep 2021 12:44 PM GMT
ప‌వ‌ర్ స్టార్ వ‌ర్సెస్ క‌లెక్ష‌న్ కింగ్! ముందుంది ముస‌ళ్ల పండ‌గ‌!!
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ `రిప‌బ్లిక్` ప్రీరిలీజ్ ఈవెంట్ వేదిక‌గా చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఏపీలో దుమారం రేపుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో సైతం ప‌వ‌న్ వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. మంత్రులు.. సినీ ప్ర‌ముఖులు ఈ వ్యాఖ్య‌ల‌పై ఎవ‌రి అభిప్రాయాల్ని వాళ్లు చెబుతున్నారు. అలాగే ప‌వ‌న్ ఆన్ లైన్ టిక్కెటింగ్ పై మండిప‌డిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వం టిక్కెట్లు అమ్మ‌డం ఏంటి? సినిమాని త‌మ చేతుల్లోకి తీసుకుంటారా? అని ఎద్దేవా చేసారు. సినిమా టిక్కెట్లు ఆన్ లైన్ లో అమ్మేస్తే.. మీ విద్యానికేత‌న్ సీట్లు కూడా ప్ర‌భుత్వ‌మే అన్ లైన్ భ‌ర్తీ చేస్తుంద‌ని ఇది మీకు ఒకేనా అంటూ ప‌రిశ్ర‌మ‌లో కొంద‌ర్ని ప‌రోక్షంగా విమ‌ర్శించే ప్ర‌య‌త్నం చేసారు.

ప‌రిశ్ర‌మ‌పై క‌న్నేస్తే చూస్తూ ఊరుకోమ‌ని హెచ్చ‌రించారు. `వ‌కీల్ సాబ్` సినిమా కార‌ణంగా ఎన్నో సినిమాలు ఇబ్బందుల‌కు గురి అవుతున్నాయ‌న్నారు. మా డ‌బ్బుతో మేము సినిమాలు చేసుకుంటే..మీ పెత్త‌నం ఏంటి? అని అస‌హ‌నం వ్య‌క్తం చేసారు. తాజాగా ఈ వ్యాఖ్య‌ల‌పై క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు స్పందించారు. నా చిర‌కాల మిత్రుడైన ప‌వ‌న్ క‌ళ్యాణ్ నువ్వు నాకంటే చిన్న‌వాడివి అందుక‌ని ఏక‌వ‌చ‌నంతో సంబోధించాను. ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు అన‌డంలో త‌ప్పేం లేదు. చాలా కాలానికి న‌న్ను మెల్ల‌గా లాగావ్.. సంతోష‌మే. ఇప్పుడు `మా ` ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. నా కుమారుడు విష్ణు పోటీ చేస్తున్నాడు. అది నీకు తెలుసు.

అక్టోబ‌ర్ 10న‌ ఎన్నిక‌లు అయిపోతాయి. ఆ త‌ర్వాత నువ్వు మాట్లాడిన ప్ర‌తీ మాట‌కి స‌మాధానం చెబుతా. ఈలోగా నువ్వు చేయాల్సిన ముఖ్య‌మైన ప‌నేంటి? అంటే నీ అమూల్య‌మైన ఓటుని నీ సోద‌ర స‌మానుడైన విష్ణుబాబుకి అత‌ని ప్యాన‌ల్ కి వేసి గెలిపించాల‌ని కోరుకుంటున్నానని చుర‌క‌లు అంటించారు. రెండేళ్ల‌కు ఒక‌సారి `మా` ఎన్నిక‌లు క్ర‌మం త‌ప్ప‌కుండా జ‌రుగుతున్నాయి. కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ `మా ` ఎన్నిక‌ల్లో ఓటు వేసింది లేదని స‌మాచారం. మ‌రి ఈసారి ఎన్నిక‌ల్లో పాల్గొంటారేమో చూడాలి. మోహ‌న్ బాబు ప్ర‌త్యేకంగా విజ్ఞ‌ప్తి చేసారు కాబ‌ట్టి అవ‌కాశాలైతే క‌నిపిస్తున్నాయి. ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే అక్టోబ‌ర్ 10 త‌ర్వాత మోహ‌న్ బాబు ప‌వ‌న్ పై ఎలా విరుచుకుప‌డ‌తార‌ని.. అప్ప‌టివ‌ర‌కూ అంతా సైలెన్స్ అని స‌స్పెన్స్ మొద‌లైంది. ఏదేమైనా 10త‌ర్వాతే ముస‌ళ్ల పండ‌గ అంటూ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు హీటెక్కిస్తున్నాయి.