Begin typing your search above and press return to search.
కూతురు కోసం.. 'కాటమరాయుడు' వెళ్లాడు
By: Tupaki Desk | 24 March 2017 9:53 AM GMTఊపిరి సలపని పనుల్లో కూడా తాను చేయాల్సిన పనుల్ని తాను మాత్రమే చేసే తత్త్వం పవన్ కల్యాణ్ సొంతంగా చెబుతుంటారు. వాస్తవానికి ఒక అగ్రహీరో తన సినిమా విడుదలకు ఒక రోజు ముందు ఎంత టెన్షన్‌గా ఉంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. దీనికి పూర్తి మినహాయింపుగా పవన్‌ను చెప్పాలి.
సినిమా చేయటమే కానీ.. దాని ఫలితం గురించి ఎంత మాత్రం ఆలోచించని వైఖరి పవన్‌లో కనిపిస్తుంటుంది. సినిమా రిలీజ్ ముందు రోజు టెన్షన్లను తనతో క్యారీ చేయని ఆయన.. తన కుమార్తె పుట్టినరోజుకు తన టైమ్‌ని స్పెండ్ చేశాడు. సినిమా విడుదల బిజీని లైట్ తీసుకున్న ఆయన.. తన కుమార్తె ఆద్య పుట్టినరోజు ఫంక్షన్ లో భాగంగా క్లాస్‌రూంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కూతురు.. ఎక్స్ సతీమణి రేణుదేశాయ్‌తో కలిసి బర్త్ డే కేక్ కట్ చేసిన ఆయన.. క్లాస్ పిల్లలతో కలిసి ఫోటోలు దిగారు. ఆ ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన రేణుదేశాయ్ ఆసక్తికర వ్యాఖ్య ఒకటి చేశారు. పిల్లలకు పేరెంట్స్ ఇవ్వగలిగిన నిజమైన బహుమతి వారి పుట్టిన రోజున కాస్త సమయం వారితో గడపటమేనని ట్వీట్ చేశారు. రేణుదేశాయ్‌తో విడాకుల అనంతరం కూడా.. పిల్లల్ని రెగ్యులర్ గా కలవటమే కాదు.. వారితో గడుపుతుంటారు. వారి బాగోగుల్ని కూడా చూస్తుంటారు. పిల్లల విషయంలో ఏ మాత్రం లోటు లేకుండా చూసుకోవటంతో పవన్ సూపర్ ఫాదర్‌గా పలువురు అభివర్ణిస్తుంటారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/