Begin typing your search above and press return to search.
వేల కోట్లు వేల ఎకరాలు సంపాదించే నాయకులు విరాళాలివ్వరా?!- పవన్ కల్యాణ్
By: Tupaki Desk | 22 Oct 2020 5:00 PM GMTహైదరాబాద్ వరద బాధితుల సాయం కోసం సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సినీపరిశ్రమ ప్రముఖుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. కొందరు కోట్లు చాలా మంది లక్షల్లో విరాళాలిచ్చారు. జనసేనాని పవన్ కల్యాణ్ సైతం తనవంతు సాయంగా కోటి విరాళం ప్రకటించారు. అయినా సినిమావాళ్లు సరిగా విరాళాలు ఇవ్వలేదని విమర్శలొచ్చాయి. దీనికి పవన్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.
ఓ ఇంటర్వ్యూలో పవన్ కి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ``సినిమా పరిశ్రమలో చాలా సంపద ఉందని సాధారణ ప్రజానీకంలో భావిస్తారు. అనుకోని కష్టంలో సినిమావాళ్లు సాయపడుతున్నా సరిపోయినంత ఇవ్వడం లేదని కొందరి విమర్శ`` అని యాంకర్ అడిగిన ప్రశ్నకు పవన్ తనదైన శైలిలో జవాబిచ్చారు.
``సరిపోయినంత ఇవ్వలేదని అనేవాళ్లు వాళ్ల జేబులోంచి రూ.10 అయినా ఇచ్చారా? ఒక 10లక్షలు ఇవ్వాలంటేనే మనసు ఒప్పుద్దా? అలాంటిది నా వరకూ చూసుకున్నా కోట్లు ఇచ్చాను... సేవాభావంతో.. `` అని పవన్ అన్నారు. సొంత ఇంట్లో కష్టం వస్తే ఏం చేయాలో తెలీదు. అత్తారింటికి దారేది నెట్ లో రిలీజైపోయిన సమయంలో రిలీజ్ చేయడానికే కష్టమైంది. నేనే సంతకం చేసి రిలీజ్ చేయించాల్సి వచ్చింది... అని తెలిపారు. చాలా సున్నితమైన సినీపరిశ్రమను చాలా సులువుగా టార్గెట్ చేసేస్తారని అది సరికాదని అన్నారు.