Begin typing your search above and press return to search.

పనులను పూర్తి చేస్తోన్న పవన్

By:  Tupaki Desk   |   14 Dec 2017 1:09 PM GMT
పనులను పూర్తి చేస్తోన్న పవన్
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి రిలీజ్ తర్వాత ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో గాని ప్రస్తుతం సినిమాపై అంచనాలు మాత్రం తార స్థాయిలో ఉన్నాయని చెప్పాలి. మొదట్లో సినిమాకు సంబందించిన చిన్న ఫొటోలు లీక్ అయ్యి ఓ రేంజ్ లో సెన్సేషన్ ని క్రియేట్ చేశాయి. ఇక రీసెంట్ గా అనిరుధ్ తన పాటలతో సినిమా ప్రమోషన్స్ కి మంచి ఊపు తెస్తున్నాడు. ఇక చిత్ర యూనిట్ పవన్ కళ్యాణ్ కొత్త లుక్స్ ని రిలీజ్ చేస్తూ అభిమానులను చాలా ఆనందపరుస్తున్నారు.

ఇకపోతే అజ్ఞాతవాసి రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో మిగతా పనులను కూడా త్వరత్వరగా పూర్తి చేయాలని త్రివిక్రమ్ దగ్గరుండి అన్ని చూసుకుంటున్నాడు. ఇప్పటికే సినిమాకు సంబందించిన అన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయిపోయాయి. సినిమాలోని నటి నటులు డబ్బింగ్ కూడా చెప్పేశారు. కానీ పవన్ కళ్యాణ్ డబ్బింగ్ మాత్రం మిగిలి ఉంది. ఆయన సినిమా షూటింగ్ అయిపోగానే పార్టీ కార్యక్రమాల నిమిత్తం విశాఖ వెళ్లిపోయారు. అయితే ఈ వారంలో పవన్ ని గ్యాప్ దొరకడంతో మొత్తం డబ్బింగ్ ను పూర్తి చేయనున్నాడట.

ఆ వర్క్ అయిపోగానే ఈ నెల 19న HICC నోవొటెల్ లో ఆడియో వేడుకను గ్రాండ్ గా జరపనున్నారు. వేడుకకి కొందరు ప్రముఖులు వస్తున్నారని వార్తలు వస్తున్నాయి కానీ అది ఎంతవరకు నిజం అనేది తెలియదు. ఇక ఆ తర్వాత పవన్ మళ్లీ రెగ్యులర్ రాజకీయాల్లోకి వెళ్లి కొన్ని పనులను చూసుకొని ఆ తర్వాత జనవరి మొదటి వారంలో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొననున్నారు.