Begin typing your search above and press return to search.

నాకస్సలు ఇష్టం లేదు.. పవన్‌ వల్లే ఒప్పుకున్నా!

By:  Tupaki Desk   |   24 Oct 2018 4:02 PM GMT
నాకస్సలు ఇష్టం లేదు.. పవన్‌ వల్లే ఒప్పుకున్నా!
X
పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన ‘బద్రి’ చిత్రంలో హీరోయిన్‌ గా నటించిన రేణు దేశాయ్‌ ఆ సమయంలోనే పవన్‌ తో ప్రేమలో పడిపోయింది. కెరియర్‌ మొదలు పెట్టిన తొలినాళ్లలోనే పవన్‌ ను ప్రేమించిన రేణు తర్వాత పవన్‌ తో సహజీవనం చేసింది. ఇదే సమయంలో వీరికి అకిరా జన్మించాడు. కొన్నాళ్ల తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక ఆద్యాకు జన్మనిచ్చింది. కొంతకాలం తర్వాత పవన్‌ తో విడిగా ఉంటూ విడాకులు తీసుకుంది. ప్రస్తుతం మరాఠీ చిత్ర పరిశ్రమలో కొనసాగుతోంది. తాజాగా పవన్‌ తో గడిపిన క్షణాలను నెమరువేసుకుంటూ ఒక ఫొటోను షేర్‌ చేసింది.

రేణు దేశాయ్‌ తాజాగా ‘జానీ’ చిత్రం సమయంలోని ఒక ఫొటోను షేర్‌ చేసి ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. నిజానికి ఈ చిత్రానికి రేణు ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా ఎంపికయ్యిందట. షూటింగ్‌ ప్రారంభానికి రెండు వారాల ముందు హీరోయిన్‌ గా రేణుకు ఆఫర్‌ చేశారట. అయితే హీరోయిన్‌ గా చేయడం తనకు అస్సలు ఇష్టం లేదట. ఇటు ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా బాద్యతలు తీసుకుంది కాబట్టి హీరోయిన్‌ గా ఒప్పుకుంటే తర్వాత ప్రాబ్లమ్‌ అవుతుందని రేణు మొదట్లో నో చెప్పిందట.

‘జానీ’ చిత్రంలో తనకు హీరోయిన్‌ గా చేయడం అసలు ఇష్టం లేకున్నా కూడా పవన్‌ వల్లే ఒప్పుకున్నాను అంటూ రేణు చెప్పుకొచ్చింది. ఏదో ఒకటి చేసి పవన్‌ నన్ను ఒప్పించే ప్రయత్నం చేశాడని - పవన్‌ ఇచ్చిన సలహాలు విన్న తర్వాత తాను ఈ చిత్రంలో హీరోయిన్‌ గా చేయడానికి సిద్దపడ్డానని - ఆ తర్వాత అటు ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా - ఇటు హీరోయిన్‌ గా రోజుకు 17 గంటలు వర్క్‌ చేస్తూ 7 నెలలు చాలా కష్ట పడ్డాను అంటోంది. ఆ అనుభవం వల్ల కష్టం విలువ తెలుసుకున్నా అంతేకాకుండా జీవితంలో కొన్ని ఎమోషన్స్‌ గురించి కూడా తెలుసుకున్నా అంటూ రేణు దేశాయ్‌ తన జ్ఞాపకాలను నెమరువేసుకుంది.