Begin typing your search above and press return to search.

పవన్ నోట.. మరో హుషారైన పాట

By:  Tupaki Desk   |   22 Dec 2017 4:34 AM GMT
పవన్ నోట.. మరో హుషారైన పాట
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో సాంగ్స్ కాస్త ప్రత్యేకంగా ఉంటాయి. సినిమాలో మామూలుగా ఉండే పాటలతో పాటు కచ్చితంగా ఒక్కటైనా ఫోక్ సాంగ్ బిట్ ఉంటుంది. ఖుషీ సినిమా నుంచి మొదలైన ట్రెండ్ ఒకట్రెండు మూవీస్ లో మినహాయించి ప్రతి సినిమాలో కంటిన్యూ చేస్తూ వచ్చాడు. ఇంతకుముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన కాటమ రాయుడా.. కదిరి నరసింహుడా అనే పాట కూడా ఫోక్ సాంగ్. పవన్ ఆ పాట స్వయంగా పాడారు. అది ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

పవన్ లేటెస్ట్ సినిమా అజ్ఞాతవాసి సినిమాలో కూడా తన గొంతు సవరించి ఓ ఫోక్ సాంగ్ తో అభిమానులను ఖుషీ చేయబోతున్నాడు. భాస్కరభట్ల ఈ పాట రాశారు. అజ్ఞాతవాసి ఆడియో ఇప్పటికే రిలీజ్ చేశారు. పవన్ బిజీగా ఉండటం వల్ల ఈ పాట రికార్డింగ్ ఆడియో రిలీజ్ ఈవెంట్ టైంకు ఈ పాట రికార్డింగ్ చేయలేదు. అందువల్ల ఈ పాట ఆల్బమ్ లో లేదు. తాజాగా పవన్ కు ఖాళీ చిక్కడంతో ఈపాట రికార్డింగ్ కూడా పూర్తి చేసేశాడు. దీంతో అజ్ఞాతవాసి సినిమాకు సంబంధించి పవన్ చేయాల్సిన  మొత్తం పని పూర్తయిపోయినట్టే. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా స్వరాలందించడం పూర్తయింది. పవన్ నోటి వెంట వచ్చే జానపద పాటకు థియేటర్లలో ఎప్పుడూ విజిల్స్ మారుమోగుతాయి. ఈ పాట కూడా అదే రేంజిలో ఉంటుందని యూనిట్ సభ్యుడొకరు తెలిపారు.

హారిక అండ్ హాసిని బ్యానర్  పై వస్తున్న అజ్ఞాతవాసి మూవీ జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. మళయాళ ముద్దుగుమ్మలు కీర్తి సురేష్.. అను ఇమ్మానుయేల్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు.