Begin typing your search above and press return to search.

సంగీత రంగంలో పవన్ కూతురు!

By:  Tupaki Desk   |   5 March 2016 1:17 PM GMT
సంగీత రంగంలో పవన్ కూతురు!
X
పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య, కొడుకు అకీరా ప్రస్తుతం తన తల్లి రేణు దేశాయ్ వద్దనే పెరుగుతున్న సంగతి తెలిసిందే. పిల్లలను ఏ లోటూ లేకుండా వారికి అన్ని రకాల కళలు నేర్పిస్తూ పెంచుతోంది రేణు. తాజాగా తన కూతురు ఆద్యా పియానో నేర్చుకుంటున్న ఫోటోను రేణు దేశాయ్ తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసింది. రేణు దేశాయ్ తన పిల్లలను భవిష్యత్తులో సినిమా రంగంలోనే సెటిలయ్యేలా వివిధ రంగాల్లో శిక్షణ ఇప్పిస్తోంది. వారిలో సినిమా రంగానికి సంబంధించిన వివిధ అంశాల్లో అవగాహన కల్పిస్తోంది.

ఆద్య సంగీతం నేర్చుకోవడాన్ని బట్టి చూస్తే పెద్దయ్యాక సంగీతం రంగంలో రాణించే అవకాశం ఉందని టాక్. ఇప్పటి వరకు పవన్ కూతురు మంచి పెయింటింగ్స్ వేస్తుంది అన్న విషయం చాల మందికి తెలుసు. అదేవిధంగా క్లాసికల్ డాన్స్ ను కూడ ఆద్య నేర్చుకుంటోంది. అయితే రేణు ట్విట్టర్ లో షేర్ చేసిన ఆద్య ఫోటోను పవన్ అభిమానులు ఒకరికొకరు షేర్ చేసుకుంటూ సందడి చేస్తున్నారు. నటనా రంగంలోనే కాకుండా సంగీతంలో కూడా రాణించడానికి మరో మెగా డాటర్ రెడీ అవుతోందని తెలుస్తోంది!