Begin typing your search above and press return to search.

పవన్ డబ్బింగ్ చెప్పాడా లేదా?

By:  Tupaki Desk   |   29 March 2016 9:48 AM GMT
పవన్ డబ్బింగ్ చెప్పాడా లేదా?
X
సరిగ్గా ఇంకో పది రోజులు మాత్రమే ఉంది ‘సర్దార్’ గబ్బర్ సింగ్’ విడుదలకు. కనీసం వారం రోజుల ముందైనా ఫస్ట్ కాపీ రెడీ చేయకుంటే కష్టం. ఆ తర్వాత చాలా హడావుడి అయిపోతుంది. ఏ చిన్న తేడా వచ్చినా అనుకున్న సమయానికి రిలీజ్ చేయడం కష్టం. ఐతే పగలూ రాత్రీ తేడా లేకుండా కష్టపడుతున్న ‘సర్దార్..’ టీమ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 8న సినిమాను రిలీజ్ చేస్తామన్న కాన్ఫిడెన్స్ తోనే ఉంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్, కాజల్ అగర్వాల్‌ ల మీద యూరోప్‌ లో పాటల చిత్రీకరణ దాదాపుగా పూర్తి కావచ్చింది. డైరెక్టర్ బాబీ లేకుండానే తనే స్వయంగా అసిస్టెంట్ డైరెక్టర్ల సాయంతో పాటలు తీసుకుంటున్నాడు పవన్. మరోవైపు ఇక్కడ వారం రోజుల నుంచి రేయింబవళ్లు డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసే పనిలో మునిగిపోయి ఉన్నాడు బాబీ. డీటీఎస్ మిక్సింగ్.. ఎడిటింగ్ పనులు కూడా సమాంతరంగా చూసుకుంటున్నాడు.

‘సర్దార్..’ డబ్బింగ్ పని దాదాపుగా పూర్తి కావచ్చిందని.. పవన్ కొన్ని సన్నివేశాలకు ఇంకా డైలాగ్స్ చెప్పాల్సి ఉందని అంటున్నారు. పవన్ రేపో ఎల్లుండో హైదరాబాద్ వచ్చేస్తాడని..తాను తీసిన పాటలకు సంబంధించి మిక్సింగ్ పని కానిస్తుంటే.. పవన్ డబ్బింగ్ పూర్తి చేస్తాడని సమాచారం. అటు ఇటుగా ఏప్రిల్ 1 నాటికి అన్ని పనులూ పూర్తి కావచ్చని.. తర్వాతి రోజు సెన్సార్ కు ముహూర్తం నిర్ణయించారని సమాచారం. మరోవైపు టీవీల్లో ఈ రోజు నుంచే సర్దార్ గబ్బర్ సింగ్ యాడ్స్ వస్తుండటం విశేషం.