Begin typing your search above and press return to search.
సీఎం సీటుకంటే మీ గుండెల్లో స్థానం ఇష్టం: పవన్ కల్యాణ్
By: Tupaki Desk | 5 April 2021 3:30 AM GMTపవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన 'వకీల్ సాబ్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి ఘనంగా జరిగింది. ఈ వేదికపై పవన్ మాట్లాడుతూ ఉండగా, అభిమానులంతా సీఎం .. సీఎం అంటూ అరిచిగోల చేశారు. అప్పుడు పవన్ స్పందిస్తూ .. "సీఎం అనేది జరగాలి .. కోరుకుంటే వచ్చేది కాదు. మీ గుండెల్లో స్థానం సంపాదిస్తానని నేను కలగన్నానా? సమాజం కోసం .. దేశం కోసం నా పని నేను చేసుకుంటూ వెళ్లిపోతాను. అది ఉన్నతమైన స్థానం ఇస్తే సంతోషం. మీ గుండెల్లో స్థానానికి మించినది ఏదీ లేదు. దాంతో పాటే వస్తే చూద్దాం .. అంతేకాని దానికోసం వెంపర్లాడింది ఎప్పుడూ లేదు.
నాకు తెలిసిన కొంతమంది లాయర్ల ఆదర్శవంతమైన జీవితాలను చూసిన తరువాత, 'వకీల్ సాబ్' సినిమాలోని ఈ పాత్ర దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. హిందీలో అమితాబ్ చేసిన పాత్రను నేను చేయడం గర్వంగా ఉంది. దేశభక్తికి సంబంధించిన పాటల్లో చేసే తృప్తి, నాకు ఐటమ్ సాంగ్స్ చేయడం వలన కలగదు. హరీశ్ శంకర్ .. బండ్ల గణేశ్ నన్ను ఇబ్బంది పెట్టి 'కెవ్వుకేక' పాట చేయించారు. ఆ పాట చేయలేక చచ్చిపోయాను. ఏదో కళ్లజోడు పెట్టుకుని కవర్ చేశాను. 'వకీల్ సాబ్' విషయానికొస్తే, ఇది ఆడపడుచులకు మేమిచ్చే గౌరవంగా చెప్పుకోవచ్చు. అవుట్ డోర్ షూటింగ్స్ లో అక్కడివాళ్లు ఎవరైనా లేడీ ఆర్టిస్టులను ఏడిపించడానికి ప్రయత్నిస్తే నేను ఎంతమాత్రం సహించేవాడిని కాదు.
ప్రకాశ్ రాజ్ పాత్ర కూడా ఈ సినిమాకి బలాన్నిస్తుంది. ఆయన నాకు ఇష్టమైన నటుడు. తెలుగు చిత్రపరిశ్రమకి అలాంటి గొప్పనటుడు దొరకడం మన అదృష్టం. తమన్ సంగీతం .. వినోద్ ఫొటోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. ఇక నాకు పొగరని కొంతమంది అనుకుంటూ ఉంటారు. నా ప్రపంచంలో నేను ఉండటం వాళ్లకి అలా అనిపించి ఉండవచ్చు. ఇక సినిమాలు ఎందుకు చేస్తున్నావని కొందరు అంటారు. అవినీతి చేయకుండా ఉండటం కోసమే నేను సినిమాలు చేస్తున్నాను. నేను ఒక సినిమా చేస్తే వెయ్యి కుటుంబాలు బతుకుతాయి. నేను సినిమాలు చేస్తాను .. ప్రజలకు సేవ చేస్తాను" అంటూ చెప్పుకొచ్చారు.