Begin typing your search above and press return to search.

పవన్.. ఎంత ఫ్రీడమ్ అనుభవిస్తున్నాడంటే..

By:  Tupaki Desk   |   19 March 2016 4:20 AM GMT
పవన్.. ఎంత ఫ్రీడమ్ అనుభవిస్తున్నాడంటే..
X
సినిమా హీరోగా సెలబ్రెటీ స్టేటస్ అనేది ఒక వరమే. అలాగే అది శాపం కూడా. ఎంత డబ్బున్నా.. ఎంత పేరున్నా.. ఎంత క్రేజ్ ఉన్నా.. స్వేచ్ఛగా జనాల మధ్య తిరగలేని పరిస్థితి. ఫ్రీడమ్ కోరుకునేవారికి.. సింపుల్‌ గా బతకాలనుకునేవారికి ఇది ఇబ్బంది కలిగించే విషయమే. బైకేసుకుని రోడ్ల మీద తిరగడం అన్నది తెలుగు స్టార్ హీరోలెవ్వరికీ సాధ్యం కాని పని. దీని వల్ల ఏదో ఒక సమయంలో మనం స్వేచ్ఛను కోల్పోతున్నామే అన్న బాధ వారిని వెంటాడుతుంది. ఐతే ఏ ఫారిన్‌ కంట్రీకో వెళ్లినపుడు మాత్రం మన స్టార్ హీరోలకు స్వేచ్ఛగా బైకులో రౌండ్లు కొట్టే అవకాశం లభిస్తుంది. చాలామంది హీరోలు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఐతే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అలా తిరగడానికి అవకాశం ఉండదు. అందులోనూ పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్‌ కు ఇదీ మరీ అసాధ్యం.

ఐతే పవన్ మాత్రం తెలుగు రాష్ట్రంలో.. అది కూడా హైదరాబాద్‌ లో బైక్ వేసుకుని కొన్ని నెలలుగా తెగ తిరిగేస్తున్నాడు. ఏదో వంద రెండొందల మీటర్లు తిరుగుతున్నాడేమో అనుకుంటే పొరబాటే. కిలోమీటర్లు కిలోమీటర్లే బైకేసుకుని.. అది కూడా షూటింగ్ లో భాగంలా కాకుండా తిరుగుతున్నాడు. ఇదంతా ఎక్కడ సాధ్యం అనుకుంటున్నారా..? రామోజీ ఫిలిం సిటీలోనండోయ్. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ షూటింగ్ మెజారిటీ పార్ట్ ఫిలిం సిటీలోనే తీశారు. దాదాపు మూడు నెలల పాటు ఇక్కడే షూటింగ్ జరిగింది.

భారీ స్థాయిలో వేర్వేరు చోట్ల సెట్టింగులు వేసి.. షూటింగ్ చేశారిక్కడ. ఐతే ప్రతి రోజూ షూటింగ్ గ్యాప్ లో పవన్ సరదాగా బైకేసుకుని.. షికార్లు కొట్టడం విశేషం. రెండు వేర్వేరు ప్రదేశాల్లో వర్క్ జరుగుతున్నపుడు పవన్ అక్కడికి ఇక్కడికి బైకు మీద షికార్లు చేయడం మామూలైపోయింది. పని మీదే కాకుండా ఏం తోచనపుడు అలా రౌండ్లు కొట్టడం కూడా అలవాటుగా మార్చుకున్నాడు పవన్. ఇక్కడైతే అతడికి ఏ డిస్టర్బెన్స్ ఉండదు. విశాలమైన ప్రాంతం కూడా. ఐతే పవన్ ఒంటరిగానే రౌండ్లు కొడుతున్నప్పటికీ అతడి వెనకే రెండు మూడు కార్లు సెక్యూరిటీగా ఫాలో అవడం మామూలైపోయింది. కొన్ని నెలలుగా ఫిలిం సిటీలో ఇది రెగ్యులర్ దృశ్యం అయిపోయింది. ఇప్పుడందరూ పవన్ షికార్లను చాలా క్యాజువల్ గా తీసుకునే పరిస్థితి వచ్చేసింది. ‘సర్దార్..’ ఆడియో వేడుక రోజు మధ్యాహ్నం వరకు కూడా ఫిలిం సిటీలోనే గడపబోతున్నాడు పవన్. అంతటితో అతడి షికార్లకు తెరపడబోతోంది. మళ్లీ కొత్త సినిమా కోసం అక్కడికి వెళ్లే వరకు ఈ ఫ్రీడమ్ కు బ్రేక్ అన్నమాట.