Begin typing your search above and press return to search.

నా ప్రతీ సినిమాకి నా జీవితంతో లింక్ -పవన్

By:  Tupaki Desk   |   18 March 2017 6:03 PM GMT
నా ప్రతీ సినిమాకి నా జీవితంతో లింక్ -పవన్
X
తన మనసులో ఎన్నో రోజులుగా దాగి ఉన్న అనేక మాటలను.. కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ తన అభిమానులతో పంచుకున్నాడు. తాను చేసిన ప్రతీ సినిమాకి.. తన జీవితంలో లింక్ ఉందంటూ.. ఆ లింక్ ఏంటో కూడా చెప్పాడు.

'త్రివిక్రమ్ నాకు సుస్వాగతం నుంచే నాకు తెలుసు. అందులో నాకు డైలాగ్స్ రాసిన ఇప్పటికీ గుర్తున్నాయి. ఆ సినిమా క్లైమాక్స్ లో తండ్రి చనిపోతే ఏడవాల్సి ఉంటుంది. అప్పుడు ఏడ్చిన తర్వాత.. నిజంగా నా తండ్రి చనిపోతే నేను ఏడుస్తానా అనిపించింది. జల్సా చేసే టైమ్ లో మా నాన్న చనిపోతే నాకు ఏడుపు రాలేదు. ఆ తర్వాత కూడా ప్రతీ సినిమా తాలూకు సంఘటన.. నా జీవితంలో జరుగుతున్నాయ్.. అది యాదృచ్ఛికమో మరోటో తెలీదు. ఓ వయసులో ప్రేమ అమ్మాయిల చుట్టూ జీవతమే అనిపిస్తుంది. నాకు ఆ ఆలోచన వచ్చినపుడు తొలిప్రేమలో కేరక్టర్ వచ్చింది. అలా ఒక్కో ఆలోచన వచ్చినపుడు అలాంటి సినిమా వచ్చేది.ఓ సూపర్ డూపర్ హిట్ వచ్చినపుడు.. దానికి ఫాలో అప్ రావడం కష్టం. తమ్ముడు కోసం ఎప్పుడో చేసిన మార్షల్ ఆర్ట్స్ ను మళ్లీ చేశాను. అదో పిచ్చి ఉన్మాదం.. అన్నిటికీ మించి అభిమానంతో చేశాను. ఆ సినిమాలో చేసిన దానికి.. ఇప్పటికీ నా చెయ్యి రాత్రి పూట తిరిగిపోతూ ఉంటుంది' అంటూ తన చేతి వేళ్లు మెలితిరిగిన విషయాన్ని చూపించాడు పవన్.

'అలాంటి భావాలు వెతికేవాళ్లకు.. అందులో ట్రావెలింగ్ సోల్జర్ పాట ఉంటుంది. హద్దులు గీసేది మీరెవరు అనిపిస్తుంది. నేను ఏ స్థాయికి వెళ్లాలి అని చెప్పడానికి వాళ్లెవరు.. ఇక్కడ నేను అంటే నేను కాదు.. మనం. మన భవిష్యత్తును హద్దులు గీసేదెవరు.. మీరనుకున్నంత నేను ఎదగను.. నేను అనుకున్నంత ఎదుగుతాను.. నేను అంటే ప్రతీ యువకుడి గురించి చెబుతున్నాను. అలాగే బద్రిలో నేను పంచుకున్నది ఇద్దరు అమ్మాయిలను కాదు. అందులో విలన్ అన్నయ్య కేరక్టర్ ఉంటుంది. నంద అయితే.. నేను బద్రి.. బద్రీనాథ్ అంటూ డైలాగ్ చెబుతాను. ఎదిగేవాడు ఇంకొకడిని తొక్కేయాలని అనుకుంటాడు. అందరు మనుషులమే.. పైనున్నంత మాత్రాన.. నువ్వు కూడా సామాన్యుడినే. ఆ డైలాగ్ కి అర్ధం ఏంటంటే.. నువ్వు కూడా నాలాంటి రక్తమాంసాలున్న సామాన్యుడివే' అంటూ బద్రి డైలాగ్ వెనకున్న మీనింగ్ వివరించాడు పవన్ కళ్యాణ్.

'ఖుషీ సినిమాలో నా దేశాన్ని ప్రేమించే పాట ఉంటుంది. యే మేరా జహా అంటూ అంటూ దేశభక్తి భానం ఉంటుంది. ఖుషీ రేపు రిలీజ్ అనగా.. మాదాపూర్ లో సినిమా చూస్తున్నాం. సినిమా మధ్యలో నా మనసు ఏదో ఆపద శంకించింది. రాబోయే రోజుల్లో నీకు బ్యాడ్ తప్పదు అనిపించి.. ఆ రోజు శక్తి కోల్పోయినట్లు అనిపించింది. భగవంతుడి ముందు మోకరిల్లాను. గబ్బర్ సింగ్ లో పోలీస్ స్టేషన్ సీన్ చేస్తున్నపుడు మళ్లీ ఆ శక్తి వచ్చింది' అంటూ తన బ్యాడ్ టైం గురించి కూడా తన మనసు తనకు ముందే చెప్పిందన్నాడు పవర్ స్టార్.