Begin typing your search above and press return to search.
పవన్ బరిలో వుంటే కథ వేరేవుండేది
By: Tupaki Desk | 13 Jan 2022 5:37 AM GMTసంక్రాంతి ఫైట్ ఈ దఫా రసవత్తరంగా వుంటుందని అంతా ఊహించారు. అందుకు తగ్గట్టే సంక్రాంతి బరిలో హేమా హేమీలంతా పోటీకి దిగారు. పాన్ ఇండియా మూవీస్ కూడా పోటీలో నిలవడంతో ఇక ఈ పండగ సీజన్ భారీ సినిమాలతో సెలబ్రేషన్స్ తరహాలో సాగుతుందని భావించారు. ఫ్యాన్స్ అయితే పండగ చేసుకున్నారు కూడా. ఈ సంక్రాంతి సీజన్ లోకి ఊహించని రీతితో దర్శకధీరుడు జక్కన్న `ఆర్ ఆర్ ఆర్`తో పోటీపడాలనుకున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల తొలి కలయికలో బిఫోర్ ఇండిపెండెంట్ నేపథ్యంలో ఇద్దరు పోరాట యోధుల కథగా ఈ మూవీని తీర్చిదిద్దడంతో ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ రిలీజ్ తరువాత ఎక్స్‌పెక్టేషన్స్ మరీ స్కైహైకి చేరుకున్నాయి. బాలీవుడ్ మీడియా, ట్రేడ్ వర్గాలు కూడా ఈ మూవీపై ప్రత్యేక దృష్టినిపెట్టాయి. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ ని ఓ రేంజ్ లో చేయడం మొదలుపెట్టారు రాజమౌళి.
ప్రమోషన్స్ ని తానే డిజైన్ చేసి ముందుండి నడిపించారు. అంతా ఒకే .. ఇక పండగ `ఆర్ ఆర్ ఆర్`తో వారం రోజుల ముందే మొదలు కాబోతోందని అంతా రెడీ అయిపోయారు.. ఇక్కడే ట్విస్ట్ పడింది. కరొనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దీంతో `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ ని వాయిదా వేయక తప్పలేదు. ఈ మూవీ రిలీజ్ వాయిదా పడినా జనవరి 14న ప్రభాస్ పాన్ ఇండియా మూవీ `రాధేశ్యామ్` రిలీజ్ గ్యారెంటీ అని మేకర్స్ ప్రకటించారు.
రిలీజ్ డేట్ పోస్టర్ తో క్లారిటీ ఇచ్చారు. పండక్కి `ఆర్ ఆర్ ఆర్` రాలేకపోతున్నా `రాధేశ్యామ్` వచ్చేస్తోంది కదా అనుకున్నారు. బిగ్ స్క్రీన్ పై `టైటానిక్`ని మరిపించే ప్రేమకథని చూడబోతున్నామని అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కానీ ఊహించిందే జరిగింది.. పరిస్థితులు మరడంతో చేసేది లేక `రాధేశ్యామ్` ని కూడా వాయిదా వేస్తున్నామంటూ మేకర్స్ ప్రకటించడంతో అంతా ఉసూరుమంటూ నిట్టూర్చారు. ఇదే సమయంలో `బంగార్రాజు` బరిలో దిగుతున్నట్టుగా ప్రకటించారు నాగార్జున. జనవరి 14న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయబోతోంది.
ఆర్ ఆర్ ఆర్.. రాధేశ్యామ్ చిత్రాల మధ్యలో అంటే జనవరి 12న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ `భీమ్లా నాయక్` విడుదల కావాలి. కానీ రక రకాల కారణాలతో రిలీజ్ కి రెడీగా వున్న ఈ మూవీని వాయిదా వేశారు. అయితే ఆర్ ఆర్ ఆర్.. రాధేశ్యామ్ సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న నేపథ్యంలో ఇప్పుడో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ టైమ్ లో `భీమ్లా నాయక్` సంక్రాంతి బరిలో దిగి వుంటే ఆ కథ వేరే వుండేది అంటున్నారు ఆయన అభిమానులు.
ఇలాంటి పండగ సీజన్ లో పవన్ సినిమా పడితే థియేటర్లలో వుండే సందడి వేరు. ఫ్యాన్స్ చేసే హంగామా వేరు.. బాక్సాఫీస్ కే ఓ కళొచ్చేది... డిస్ట్రిబ్యూటర్లంతా పండగ చేసుకునేవారు. ఓ రేంజ్ లో అభిమానులంతా రచ్చ చేసేవారు. ఆ కథే వేరేవుండేది అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. నిజమే సంక్రాంతి బరిలో `భీమ్లా నాయక్` దిగివుంటే సెలబ్రేషన్స్.. హంగామా మామూలుగా వుండేది కాదన్నది ఇప్పడు ప్రతీ ఒక్కరినోట వినిపిస్తోంది.