Begin typing your search above and press return to search.
కత్తి ప్రశ్నలు-పవర్ జవాబులు
By: Tupaki Desk | 9 Jan 2018 6:31 AM GMTమొన్న సోమాజీగూడా ప్రెస్ క్లబ్ లో మీడియా ఎదుట ఫిలిం క్రిటిక్ - దర్శకుడు కత్తి మహేష్ హీరొయిన్ పూనం కౌర్ ని`ఉద్దేశించి అడిగిన ఆరు ప్రశ్నలు ఎంత కలకలం రేపాయో చూసాం. ఇంకా ఆ గొడవ పూర్తిగా సద్దుమణగలేదు. నిన్న పూనం కౌర్ పవన్ కళ్యాణ్ ని స్పందించమని కోరుతున్నట్టుగా అర్థం వచ్చేలా ఒక ట్వీట్ చేయటం, మరి కాసేపటికే దాన్ని డిలీట్ చేయటం కూడా చిన్నపాటి రాద్ధాంతం అయ్యింది. ఈ లోపు కత్తి మహేష్ సంధించిన ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ స్వయంగా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, ఫాన్స్ కొందరు సర్కులేట్ చేస్తున్న ఒక మెసేజ్ ఇప్పుడు అందరికి వైరల్ గా రీచ్ అవుతోంది. అందులో చెప్పిన దాన్ని బట్టి సారాంశం తీసుకుంటే ఇలా వస్తోంది.
పూనం కౌర్ పరిశ్రమకు వచ్చిన తొలినాళ్ళలో అవకాశాల పరంగా చాలా ఇబ్బందులు పడింది. చేసిన సినిమాలు కూడా సక్సెస్ కాలేదు. ఆ టైంలో జల్సా సినిమాలో ఇలియానా అక్కయ్యగా నటించిన కమలిని ముఖర్జీ పాత్రకు ముందు పూనం నే అనుకున్నారు. కాని కమ్యూనికేషన్ గ్యాప్ వల్లనో మరే ఇతర కారణం వల్లనో తనను తీసుకోలేకపోయారు. జల్సా కోసం డేట్ క్లాష్ కాకూడదు అనే ఉద్దేశంతో పూనం తనకు వచ్చిన బయటి ఆఫర్స్ అన్ని వదులుకుంది. ఆ టైంలో ఒక పూజా కార్యక్రమంలో పూనం - పవన్ కలిసి కనిపించారు. ఇంతలో ఆ పాత్రకు కమిలిని అయితేనే యాప్ట్ గా ఉంటుంది అని భావించిన త్రివిక్రమ్ పూనం కు ఆఫర్ ఇవ్వలేకపోయాడు.
దీంతో సహజంగానే హర్ట్ అయిన పూనం కౌర్ మనస్తాపం చెంది త్రివిక్రమ్ మీద కోపం తెచ్చుకున్న మాట నిజం. ఆ దిగులుతోనే ఆత్మహత్య ప్రయత్నం చేయబోతే కుటుంబ సభ్యులు కాపాడారు. అప్పుడు విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ తనను ఓదార్చి తనకు చక్కని అవకాశం కల్పిస్తాను అని మాట ఇచ్చి ఆమె తల్లికి మాట ఇచ్చారు. అందులో భాగంగానే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరఫున చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ అయ్యింది.
ఇది నిజమో కాదో నిర్ధారించే ఆధారాలు వీటితో జత చేయలేదు కాని నమ్మే విధంగానే ఉండటంతో పవన్ ఫాన్స్ ఇవి కత్తి మహేష్ ప్రశ్నలకు సమాధానాలు అంటూ అందరికి షేర్ చేస్తున్నారు. ఈ విషయంలో జనసేన మౌనంగా ఉండాలని నిర్ణయించుకుంది అని వార్తలు వచ్చిన నేపధ్యంలో వీటి గురించి కత్తి మహేష్ మళ్ళి స్పందించడం గురించి ఇంకా ఎటువంటి అప్ డేట్ రాలేదు. లోగుట్టు పెరుమాళ్ళుకెరుక తరహాలో ఇది ముందు ముందు ఇంకెన్ని మలుపులు తిరగబోతోందో అని ఎదురు చూస్తున్నారు సినిమా జనం.