Begin typing your search above and press return to search.

'వకీల్ సాబ్' కోసం వకీల్ గెటప్స్ లో..!

By:  Tupaki Desk   |   10 April 2021 6:42 PM GMT
వకీల్ సాబ్ కోసం వకీల్ గెటప్స్ లో..!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా 'వకీల్ సాబ్' ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం గ్రాండ్ గా రిలీజయింది. 'పింక్‌' రీమేక్‌ గా వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. బోనీకపూర్ - దిల్ రాజు కలిసి నిర్మించారు. ఇక యూఎస్ఏ లో 260కి పైగా లోకషన్లలో విడుదల చేసినట్లు తెలుస్తోంది. మూడేళ్ళ తర్వాత పవన్ హీరోగా నటించిన సినిమా కావడంతో ఓవర్ సీస్ లో కూడా అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. మూవీ చూసిన కొందరు సోషల్ మీడియాలో ఫన్ మూమెంట్స్ ని షేర్ చేశారు. అయితే ఇందులో పవన్ పోషించింది లాయర్ పాత్ర కావడంతో అభిమానులు 'వకీల్ సాబ్' సినిమాకు నల్లకోటు ధరించి వకీల్ గెటప్స్ లో వెళ్లినట్లు తెలుస్తోంది. వారిలో కొందరు అమెరికన్స్ కూడా నల్లకోటు ధరించి కనిపిస్తుండటం గమనార్హం.

కాగా, 'వకీల్ సాబ్' సినిమా యూఎస్ఏ లో 50 శాతం ఆక్యుపెన్సీతో రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రీమియర్ల ద్వారా ఏకంగా 3 లక్షల డాలర్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు నాలుగు లక్షల డాలర్స్‌ కు పైగా వసూళ్ళు రాబట్టి సంచలనం సృష్టిస్తోంది. అలానే ఆస్ట్రేలియాలో 84.07 లక్షలు.. న్యూజిలాండ్ లో 13 లొకేషన్స్ లో 5.61 లక్షలు వసూళ్ళు సాధించింది. కోవిడ్ పరిస్థితుల్లో ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే మామూలు విషయం కాదు. ఇది ఇలానే కొనసాగితే 'వకీల్ సాబ్' రాబోయే రోజుల్లో మరిన్ని కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి.