Begin typing your search above and press return to search.
సూర్యకు పవర్ మైలేజ్
By: Tupaki Desk | 22 April 2018 6:05 AM GMTఅల్లు అర్జున్ నా పేరు సూర్య విడుదలకు అట్టే సమయం లేదు. సరిగ్గా 12 రోజుల్లో సిన్సియర్ మిలిటరీ ఆఫీసర్ సూర్యగా బన్నీ వెండితెరను ఎటాక్ చేయబోతున్నాడు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చే హీరో సినిమా ఏదైనా మెగాహీరోలందరి అభిమానుల సపోర్ట్ చాలా అవసరం. బన్నీకి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికి అందరు ఒకేతాటిపైకి వస్తే ఓపెనింగ్స్ పరంగా చాలా పెద్ద ప్లస్ అవుతుంది. కాని పవన్ కళ్యాణ్-వర్మల మధ్య చెలరేగిన వివాదం కారణంగా మెగా ఫాన్స్ అంత హుషారుగా లేరు. రంగస్థలం హడావిడి దాదాపు తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళ దృష్టి నా పేరు సూర్య మీద పడింది. కాకపోతే చెప్పను బ్రదర్ ఇష్యూ వల్ల పవన్ ఫాన్స్ కు బన్నీ అబిమానులకు మధ్య గతంలో గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. అది డిజే రిలీజ్ అయినప్పుడు బయటపడింది కూడా.
కాని మొన్న ఫిలిం చాంబర్ వేదికగా పవన్ చేసిన నిరసనకు మద్దతుగా అందరికంటే ముందుగా అక్కడికి నాగబాబుతో చేరుకుంది అల్లు అర్జునే. తర్వాత ఒక్కొక్కరుగా వచ్చారు. ఫోటోలలో వీడియోలలో పవన్ బన్నీ ఒకరినొకరు ఎమోషనల్ గా కౌగిలించుకోవడం బాగా హై లైట్ అయ్యింది. అంతే కాదు పవన్ అల్లు అర్జున్ కు ఏదో సీరియస్ గా చెప్పడం బన్నీ అంతే శ్రద్ధగా పవన్ చెబుతోంది వినడం ఫాన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. సో పవన్ కు బన్నీకు మధ్య ఉన్న దూరం తమ మధ్యే కాని వాళ్ళకు ఏమి లేదని గుర్తించిన అభిమానులు ఇప్పుడు వాటిని మర్చిపోయి నా పేరు సూర్యకు సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అదే కనక జరిగితే బన్నీ మూవీకి మరింత బలం వచ్చినట్టే. ఈ రోజు సాయంత్రం మిలిటరీ మాధవరంలో జరిగే నా పేరు సూర్య వేడుక కోసం ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. రంగస్థలం-భరత్ అనే నేను ఘన విజయాల నేపధ్యంలో నా పేరు సూర్య మీద కూడా ప్రీ పాజిటివ్ బజ్ చాలానే ఉంది.