Begin typing your search above and press return to search.
పవన్ అభిమానిపై బాలయ్య అభిమాని దాడి
By: Tupaki Desk | 12 Jan 2018 10:48 AM GMTఅభిమానం వెర్రితలలు వేస్తోంది. తమ అభిమాన హీరోపై ప్రేమతో మరో నటుడి ఫ్యాన్స్‌పై దాడికి ఉసిగొల్పుతోంది.హీరోలు తాము అంతా ఒకటే అని ఎన్ని సార్లు చెప్పినా.. అభిమానుల మధ్య వైరం తగ్గడం లేదు.. తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అని వివాదాలకు వెళ్ళి.. దాడి చేసుకొనే వరకు వెళ్తున్నారు. ఇలాగే సంక్రాంతి బరిలో నిలిచిన తమ హీరోల సినిమాలపై అభిమానుల మధ్య వివాదం తలెత్తి.. దాడికి దారి తీసింది. శ్రీకాకుళం జిల్లాలో మాటా మాటా పెరిగి బ్లేడ్ తో దాడి చేసే స్థాయికి గొడవ జరిగింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సంక్రాంతి కానుకగా రిలీజైనప్పటికీ మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో బాలకృష్ణ జైసింహా రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో ఇచ్చాపురం లో అజ్ఞతవాసి - జై సింహా సినిమాల విషయంలో పవన్ - బాలయ్య అభిమానుల మధ్య వాగ్వాదం మొదలై.. ఘర్షణకు దారి తీసింది. పవన్ అభిమాని దనపాన హరిశ్చంద్ర తో బాలయ్య అభిమాని చాట్ల ఫకీరు ఘర్షణ పడ్డాడు.. అక్కడ ఉన్న స్థానికులు సర్ధి చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోయారు. కాగా ఘర్షణ చోటు చేసుకొన్న ప్లేస్ లో తన చెప్పులు ఉండడంతో పవన్ అభిమాని అక్కడకు వెళ్ళి... చెప్పులు తీసుకొంటుండగా.. ఇంతలో బాలయ్య అభిమాని ఫకీరు బ్లేడ్ తో హరిశ్చంద్ర పై దాడి చేశాడు. దాడిలో మెడ చెవి భాగాలకు గాయాలు అయ్యాయి.
ఈ ఉదంతంతో బాధితుడి బాలయ్య అభిమానిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పవన్ అభిమాని హరిశ్చంద్ర ను చికిత్స కోసం ఇచ్చాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు బాలయ్య అభిమానిని అదుపులోకి తీసుకొని దాడికి పాల్పడిన స్థలం ఒడిశా రాష్ట పరిధిలో ఉన్నందున కేసు అక్కడికి బదలాయిస్తామని చెప్పారు. కాగా గతంలో బాలయ్య అభిమాని దాడిలో పవన్ అభిమాని మృతి చెందిన సంగతి విధితమే.
మరోవైపు విశాఖలో ఫ్లెక్సీ గొడవ చోటుచేసుకుంది. ఏకంగా చరిత్ర చెప్పుకొనే స్థాయికి ఈ గొడవ చేరింది. 'తాతల చరిత్ర చెప్పుకునే అలవాటు లేదు.. మేము సృష్టించే చరిత్రలే భావితరాలకు భగవద్గీత' అని పేర్కొంటూ థియేటర్ వద్ద కొంతమంది పవన్ అభిమానులు ఓ బ్యానర్ ఏర్పాటు చేశారు. ఇది పరోక్షంగా నందమూరి వంశస్థులను ఉద్దేశించిందని పలువురు అంచనా వేశారు. సహజంగానే ఈ ఫ్లెక్సీ నందమూరి ఫ్యాన్స్‌కు ఠారెత్తుకచ్చేలా చేసింది. దీంతో వారు సైతం మరో ఫ్లెక్సీ...అక్కడ పెట్టేశారు. 'మాకు నాన్న, తాత చరిత్ర ఉంది కాబట్టి చెప్పుకుంటున్నాము. మీకేముందిరా చెప్పుకోవడానికి చరిత్ర.. ఒక మహానీయుని గురించి చెప్పితే అది చరిత్ర అవుతుంది. అదే మీ చరిత్ర చెప్పితే భావి తరాలకు కాదు కదా.. బావిలో దూకడానికి కూడా పనికిరాదు` అంటూ ఇంకో ఫ్లెక్సీ పెట్టేసి కౌంటర్ ఇచ్చారు.