Begin typing your search above and press return to search.

కోహినూర్ వ‌జ్రాన్ని చోరీ చేయ‌బోతున్న‌ పీకే

By:  Tupaki Desk   |   6 March 2020 7:12 AM GMT
కోహినూర్ వ‌జ్రాన్ని చోరీ చేయ‌బోతున్న‌ పీకే
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌థానాయ‌కుడిగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో పీఎస్ పీకే 27 సెట్స్ పై ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇదో హిస్టారిక‌ల్ కాన్పెస్ట్ ఉన్న‌ సినిమా. రొటీన్ కి భిన్న‌మైన పాత్ర‌లో ప‌వ‌న్ న‌టిస్తున్నారు. ఇందులో ప‌వ‌న్ క‌ల్యాణ్ రాబిన్ హుడ్ త‌ర‌హా బంధిపోటు పాత్ర‌లో న‌టిస్తున్నార‌ని ఇప్ప‌టికే క్లూ అందింది. అంటే పెద్ద‌ల్ని కొట్టి పేద‌ల‌కు పంచే వాడిగా అత‌డి పాత్ర ఉండ‌బోతోంద‌న్న‌మాట‌.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ప‌వ‌న్ క‌ల్యాణ్ పై కోహినూర్ వ‌జ్రాన్ని దొంగిలించే సీన్స్ ని క్రిష్ ప్లాన్ చేశార‌ని తెలుస్తోంది. ఇక ఈ సీన్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుంద‌ని ఆన్ సెట్స్ నుంచి టాక్ లీకైంది. భీక‌ర‌మైన మ‌హా స‌ముద్రంలో ఒక భారీ షిప్ నుంచి ప‌వ‌న్ కోహినూర్ వ‌జ్రాన్ని దొంగిలిస్తాడ‌ట‌. అంటే బ్రిటీష‌ర్లు కోహినూర్ ని ఎత్తుకెళ్ల‌నీకుండా ఆపే ప్ర‌య‌త్నంలో ఈ దొంగ‌త‌నం చేస్తాడా? లేక బ్రిటీషర్స్ కోస‌మే దానిని దొంగిలించే ప్ర‌య‌త్నం చేస్తాడా? అన్న‌ది తెర‌పైనే చూడాలి.

ఇక కోహినూర్ ని ఎత్తుకెళ్లిన ఆంగ్లేయులు అత్యంత విలువైన నెమ‌లి సింహాస‌నాన్ని ఎత్తుకెళ్లాడ‌న్న‌ది హిస్ట‌రీ. మ‌రి క్రిష్ చారిత్రక క‌థాంశాన్ని ఎంచుకున్నారు కాబ‌ట్టి దానికి తెర‌పై విజువ‌ల్ గా ఎలా చూపించ‌బోతున్నారోన‌న్న క్యూరియాసిటీ నెల‌కొంది. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణితో పోలిస్తే బాగా వెయిట్ ఉన్న స‌బ్జెక్టునే ఎంచుకుని క్రిష్ ఈ సినిమా తీస్తుండ‌డంతో పీకే అభిమానుల్లోనూ ఉత్సాహం నెల‌కొంది. ఈ సినిమా కి బ‌డ్జెట్ రేంజ్ ఎంత‌? అన్న‌దానిపైనా మ‌రింత క్లారిటీ రావాల్సి ఉంది. ప‌వ‌న్ స్నేహితుడు ఏ.ఎం ర‌త్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న కీర్తి సురేష్ క‌థానాయిక‌ గా న‌టించ‌నుందని.. ప్ర‌గ్య జైశ్వాల్ ఓ ఆస‌క్తిక‌ర పాత్ర పోషిస్తోంద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది.