Begin typing your search above and press return to search.
వాళ్లందరూ పవన్ ఉగ్రరూపం చూశారట
By: Tupaki Desk | 7 March 2016 7:21 AM GMTప్రతి మనిషిలోనూ రెండు యాంగిల్స్ ఉంటాయి. చాలా ప్రశాంతంగా కనిపించేవాళ్లు సైతం ఒక్కోసారి ఉగ్రరూపం దాలుస్తారు. పవన్ కళ్యాణ్ కూడా అలా తనలోని రెండో యాంగిల్ చూపించాడట ‘సర్దార్ గబ్బర్ సింగ్’ యూనిట్ సభ్యులకు. సర్దార్ ఎడిటింగ్ టేబుల్ దగ్గర తీసిన ఒక ఫొటో రెండు రోజులుగా ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది కేవలం ఫొటో కాబట్టి సరిపోయింది. ఒకవేళ వీడియో కూడా క్యాప్చర్ చేసి నెట్ లో పెట్టేసి ఉంటే ఏంటి పరిస్థితి? అందుకే పవన్ ‘సర్దార్..’ టెక్నికల్ టీమ్ మీద విరుచుకుపడ్డట్లు సమాచారం.
ఇంతకుముందు ‘అత్తారింటికి దారేది’ సినిమా విడుదలకు ముందు బయటికి వచ్చేయడంపై అప్పట్లో పవన్ సహా ఆ యూనిట్ సభ్యులు ఎంత వేదన అనుభవించారో తెలిసిందే. ఆ సినిమా థ్యాంక్స్ మీట్ లో చాలా ఆవేశంగా మాట్లాడాడు పవన్. మళ్లీ ఇప్పుడు ‘సర్దార్..’ విషయంలోనూ లీకేజీ బెడద మొదలవడంతో పవన్ చాలా సీరియస్ అయ్యాడట. ముందే హెచ్చరికలు జారీ చేసినా.. ఇలా ఎలా జరిగిందంటూ ఎడిటింగ్ టీమ్ మీద అరిచాడట పవన్. ఇంకోసారి ఇలా జరిగిందో అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడట.
నిర్మాత శరత్ మరార్ కు కూడా ఈ విషయంలో గట్టిగా క్లాస్ పీకాడట. దీంతో సర్దార్ ఎడిటింగ్ జరిగే ప్రదేశాల్లో సెక్యూరిటీ పెంచాడట శరత్ మరార్. కేవలం ఫొటోనే కాకుండా ఎవరైనా వీడియో కూడా తీశారేమో అని అందరినీ చెక్ చేసి.. అలాంటిదేమీ లేకపోవడం ఊపిరి పీల్చుకున్నారట. ‘సర్దార్..’కు సంబంధించి ఏ చిన్ని విషయం బయటకు పొక్కినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు కూడా జారీ చేశారట.