Begin typing your search above and press return to search.
భగత్ సింగ్ ని పక్కన పెట్టి, పవన్ మెచ్చిన రీమేక్ తోనే వెళ్తున్నారా..?
By: Tupaki Desk | 26 Nov 2022 4:32 AM GMT'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో మరో సినిమా చేయాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ క్రేజీ కలయికలో "భవదీయుడు భగత్ సింగ్" అనే చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.
అయితే 'పవన్ - హరీశ్' రెండో ప్రాజెక్ట్ ప్రకటనకే పరిమితమైంది. నెలలు గడుస్తున్నా సెట్స్ మీదకు వెళ్ళలేదు. వివిధ కారణాల వల్ల సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. పవన్ కల్యాణ్ ప్రస్తుతం "హరి హర వీరమల్లు" చిత్రంపైనే దృష్టి పెట్టడంతో.. BBS మూవీ ఇప్పట్లో కష్టమే అనే వార్తలు వినిపించాయి.
2024 సార్వత్రిక ఎన్నికల లోపు పవన్ ఒక్క సినిమా మాత్రమే చేసే అవకాశం ఉండటంతో.. దర్శకుడు హరీశ్ శంకర్ మరో హీరో కోసం ట్రై చేస్తున్నాడని ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో పవన్ మరియు హరీష్ కలిసి వర్క్ చేయటానికి రెడీ అవుతున్నారనే మరో న్యూస్ వచ్చింది.
కాకపొతే ముందుగా ప్రకటించిన 'భవదీయుడు భగత్ సింగ్' కథతో కాకుండా.. 'తేరి' అనే తమిళ్ రీమేక్ చిత్రం కోసం వీరిద్దరూ జట్టుకట్టనున్నారని రూమర్స్ వస్తున్నాయి. అయితే BBS ని పక్కనపెట్టి, రీమేక్ స్క్రిప్ట్ తో వెళ్ళాలనే ఐడియా పవన్ దే అని అంటున్నారు.
ఇటీవల వీరమల్లు సెట్స్ లో పవన్ కళ్యాణ్ ను హరీష్ శంకర్ మీట్ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య సినిమా గురించి చర్చలు జరగ్గా.. 'తేరి' రీమేక్ మీద వర్క్ చేయాలని పవన్ కొన్ని ఐడియాలు చెప్పారట. స్క్రిప్ట్ రెడీ చేయటానికి దర్శకుడికి పవన్ మూడు నెలల సమయం ఇవ్వగా.. ఇప్పుడు హరీశ్ అదే పనిలో ఉన్నాడని అంటున్నారు.
అన్నీ కుదిరితే వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించనున్నారని టాక్. హరీష్ శంకర్ ఫైనల్ డ్రాఫ్ట్ తో పవన్ ని మెప్పించిన తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం వుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ ప్రాజెక్ట్ రూపొందనుంది.
నిజానికి పవన్ కల్యాణ్ తో 'తెరి' రీమేక్ చేయటానికి చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పట్లో 'కందిరీగ' దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేశారు. పవన్ తో కాకపొతే మాస్ మహారాజ్ రవితేజ తో చేయాలని భావిస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ సంతోష్ తో ఏదీ ముందుకు వెళ్ళలేదు.
ఇప్పుడు రీఎంట్రీ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ రీమేక్స్ చేస్తున్న పవన్.. హరీశ్ శంకర్ తో 'తెరి' రీమేక్ చేయాలని అనుకుంటున్నారట. 'దబాంగ్' లో మార్పులు చేర్పులు చేసి, 'గబ్బర్ సింగ్' గా రెడీ చేసినట్లే.. ఒరిజినల్ లో చాలా మార్పులు ఉంటాయని అనుకుంటున్నారు.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. విజయ్ హీరోగా నటించిన 'తెరి' సినిమా, 'పోలీసోడు' పేరుతో తెలుగులో డబ్బింగ్ కాబడి మంచి విజయం సాధించింది. ఆల్రెడీ తెలుగు ఆడియన్స్ చూసేసిన చిత్రాన్ని.. మళ్ళీ తెలుగులో రీమేక్ చేయాలని పవన్ కళ్యాణ్ ఇష్టపడుతున్నారని తెలుస్తోంది.
ఇంతకముందు 'వీరుడొక్కడే' పేరుతో తెలుగులో రిలీజైన తమిళ చిత్రాన్ని.. పవన్ కళ్యాణ్ 'కాటమ రాయుడు' గా రీమేక్ చేసి ఫ్లాప్ అందుకున్నారు. తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న 'లూసిఫర్' సినిమాని ఇటీవల మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' గా రీమేక్ చేసి, ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయారు. మరి ఇప్పుడు పవన్ - హరీశ్ కలిసి 'పోలీసోడు' ని రీమేక్ చేయనున్నారని అంటున్నారు. టీమ్ జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.