Begin typing your search above and press return to search.
పుట్టిన రోజున విషాదం: అమరావతిలో భారీ ఫ్లెక్సీ చించివేత
By: Tupaki Desk | 2 Sep 2021 11:30 AM GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే యూత్ లో ఎనలేని క్రేజీ. సినిమాల్లో ఆయన నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతారు. ఆయన సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ థియేటర్ల వద్ద పండుగ చేసుకుంటారు. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఇతరులు పవన్ అంటే అమితాసక్తి చూపిస్తారు. అలాంటి పవన్ బర్త్ డే అంటే ఎలా ఉంటుంది..? బర్త్ డే రోజు ఫ్యాన్స్ జోష్ ఎలా ఉంటుంది..? మాటల్లో కాదు.. చేతల్లోచూపిస్తామని అభిమానులు ఈసారి భారీ ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పవన్ బర్త్ డే సందర్భంగా భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే పుట్టిన రోజు సందర్భంగా పవన్ అభిమానుల్లో విషాదం నెలకొంది. ఆ విషాదమేంటో చూద్దాం..
సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు పవన్ కల్యాణ్. మూడేళ్ల కిందట పార్టీ ప్రారంభించిన రాజకీయాల్లోకి వచ్చినా ఆయనకు గత 2019 ఎన్నికల్లో నిరాశే ఎదురైంది. అయినా వెనకడుగు వేయకుండా పవన్ ప్రజా సమస్యల తరుపున పోరాడుతూనే ఉన్నాడు. రైతులు, కార్మికులు ఇలా అల్పసంఖ్యా వర్గాల తరుపున వాదిస్తూ వారికి అండగా ఉంటున్నాడు. పార్టీ పటిష్టత కోసం శ్రేణులకు అందుబాటులో ఉంటూ రాజకీయంగా ఎదిగేందుకు వ్యూహ రచన చేస్తున్నాుడు.
ఈ క్రమంలో పవన్ ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాడు. ముఖ్యంగా మూడు రాజధానుల విషయంలో పవన్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతికంగా ఉన్నాడు. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలంటూ ఇక్కడి వారి తరుపున వాదిస్తున్నాడు. అయితే పవన్ రాజకీయాలకు సరిపోడని.. సినిమాలు చేసుకుంటేబెటరని చాలా మంది నాయకులు విమర్శించారు. దీంతో జనసేన నాయకులు అలాంటి వారికి చురకలనంటిస్తూనే ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో జనసైన్యం పోస్టులు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి.
తాజాగా గురువారం పవన్ బర్త్ డే సందర్భంగా పలువరు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక అయన అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అక్కడ పండుగ వాతావరణం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే కొందరి చేష్టల వల్ల పవన్ అభిమానుల్లో తీవ్ర నిరాశ ఏర్పడింది. ఆయన బర్త్ డే సందర్భంగా అమరావతిలో భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే ఉదయం వరకు ఆ ఫ్లెక్సీని కొందరు మధ్యలోకి చింపేశారు. దీంతో ఆ ఫ్లెక్సీ రూపు లేకుండా పోయింది. ఈ విషయం తెలుసుకున్న పవన్ అభిమానులు వెంటనే అక్కడికి వచ్చి ఆందోళన చేశారు. ఫ్లెక్సీ చింపిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. పవన్ రాజకీయంగా ఎదగడాన్ని ఓర్వలేకే కొందరు ఇలాంటి చర్యలు పాల్పడ్డారిన పవన్ అభిమానులు, జనసేన నాయకులు విమర్శించారు.
కాగా గత సంవత్సరం పవన్ బర్త్ డే వేడుకల సందర్భంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ ముగ్గురు అభిమానులు విద్యుత్ షాక్ తో మరణించారు. ఈసారి కొందరు పవన్ ఫ్లెక్సీలను చింపేశారు. గత సంవత్సరం జరిగిన విషాదం నుంచి కోలుకోకముందే ఈసారి పవన్ అభిమానుల్లో మరో నిరాశ ఎదురైంది. అయితే పవన్ ఫ్లెక్సీని ఎక్కడో చింపితే పెద్దగా పట్టించుకునేవారు కాదని, అమరావతిలోనే ఈ సంఘటన జరగడంపై రకరకాలుగా వాదనలు వినిపిస్తున్నాయి. పవన్ మూడు రాజధానులను వ్యతిరేకించడం ద్వారానే కొందరు ఈ పని చేశారంటున్నారు.
ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని పవన్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. కొందరు వెంటనే పవన్ వ్యతిరేకులను పోస్టులు పెడుతున్నారు. అయితే పవన్ ఫ్లెక్సీ చింపడం పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అనవసర వివాదాలను సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు పవన్ అభిమానులకు హామీ ఇస్తున్నారు.