Begin typing your search above and press return to search.
అమెరికాలో పవన్.. అలా కనిపించేశాడు!
By: Tupaki Desk | 8 Feb 2017 1:59 PM GMTఒకవైపు కాటమరాయుడు షూటింగ్ కంప్లీట్ చేస్తూ.. ఇంకో వైపు తర్వాతి సినిమా అయిన త్రివిక్రమ్ మూవీకి ప్రీ ప్రొడక్షన్ పనులను పరిశీలిస్తూ.. మరోవైపు పొలిటికల్ గా యాక్టివ్ గా ఉంటూ.. జనసేనను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటూ.. ఫుల్లు బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్.
ఇలాంటి సమయంలో హార్వర్డ్ యూనివర్సిటీలో లెక్చర్ ఇవ్వాలంటూ పవర్ స్టార్ కు ఆహ్వానం వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా ఇన్విటేషన్ రాగానే పవన్ కోసం నాలుగు ఖరీదైన డిజైనర్ సూట్స్ సిద్ధం చేసేశారట పవన్ టీం. బెస్ట్ డిజైనర్స్ ను పిలిపించి అత్యుత్తమైన ఫ్యాబ్రిక్ తో.. హుందాగా కనిపించేలా వీటి డిజైనింగ్ జరిగిందని తెలుస్తోంది. అయితే.. ఆఖరి నిమిషంలో పవన్ ఇవేవీ వద్దని చెప్పేశాడట. అమెరికా వెళ్లి పశ్చిమ దేశాల సంస్కృతి ప్రకారం వెస్ట్రన్ వేర్ అయిన కోట్స్ వేసుకోవడం కంటే.. ఎక్కడికి వెళ్లినా ఇండియన్ కల్చర్ ను ప్రతిబింబించేలా దుస్తులు వేసుకోవడమే సరియైన పని అన్నాడట పవన్.
అప్పటికప్పుడు కొన్ని పైజమా-కుర్తాలను తెప్పించుకుని అమెరికా ఫ్లైట్ ఎక్కేశాడు పవర్ స్టార్. అదే డ్రస్సులో అమెరికా ఎయిర్ పోర్టులలో పలువురికి కనిపంచాడు కూడా. పూర్తిగా ఖాదీ దుస్తుల్లో పవన్ ని చూసి.. చాలామంది ఆశ్చర్యపోయారని తెలుస్తోంది. హార్వర్డ్ లో లెక్చర్ తో పాటు.. పలు తెలుగు అసోసియేషన్లతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ కానున్నాడని తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/