Begin typing your search above and press return to search.
పవన్ ‘అపరిచితుడు’గా మారిన వేళ..
By: Tupaki Desk | 14 March 2016 9:40 AM GMTనేను మంచి నటుణ్ని కాదు.. అంటుంటాడు పవన్ కళ్యాణ్. ఐతే ఆయన టాలెంట్ మీకేం తెలుసు అంటోంది కన్నడ భామ సంజన. ఒకే లొకేషన్ లో మూడు రకాల అవతారాల్లో మూడు రకాల హావభావాలతో అదరగొట్టేశాడని.. తనతో పాటు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ యూనిట్ సభ్యులంతా ఆయన టాలెంట్ చూసి స్టన్ అయిపోయామని అంటోంది సంజన.
ఏప్రిల్ 8న ఎట్టి పరిస్థితుల్లోనూ ‘సర్దార్..’ను ప్రేక్షకుల ముందుకు తేవాలని ప్రయత్నిస్తున్న పవన్ కళ్యాణ్.. ఇందుకోసం రేయింబవళ్లు కష్టపడుతున్న సంగతి తెలిసిందే. ఒకేసారి రెండు మూడు యూనిట్లతో షూటింగ్ చేయిస్తూ.. స్వయంగా అన్ని యూనిట్లనూ పర్యవేక్షిస్తూ.. ఆ మూడు చోట్లా కెమెరా ముందు అభినయిస్తూ.. సర్వాంతర్యామిలా పవన్ తిరుగుతున్నాడని సర్దార్ యూనిట్ సభ్యుల చెబుతున్నారు.
దీని గురించే సంజన చెబుతూ.. ఒక రోజు ఒకే లొకేషన్ లో మూడు యూనిట్లు పని చేశాయని.. ఒకచోట ఫైట్.. ఇంకో చోట పాట.. మరోచోట ఎమోషనల్ సీన్ తీశారని.. పవన్ ఆ మూడు చోట్లా కొంచెం టైం గ్యాప్ లో పెర్ఫామ్ చేశాడని.. ఆ సమయంలో ఆయన్ని చూస్తే ‘అపరిచితుడు’లా కనిపించాడని చెప్పింది. పవన్ ఆయా సన్నివేశాల కోసం ట్రాన్స్ ఫార్మ్ అయిన తీరు అమోఘం అంటోంది. అంతా ఓకే కానీ.. ముందంతా తాపీగా ఉండిపోయి.. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నపుడు పవన్ మరీ ఇంతగా హడావుడి పడటమే ఆశ్చర్యం కలిగిస్తోంది.