Begin typing your search above and press return to search.
సర్దార్ గబ్బర్ సింగ్.. ఏంటి పరిస్థితి?
By: Tupaki Desk | 7 March 2016 5:30 PM GMTపవన్ కళ్యాణ్ సినిమా రిలీజవుతుంటే ఉండే హంగామానే వేరు. పవర్ స్టార్ కొత్త సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ షెడ్యూల్ ప్రకారం సినిమా రిలీజయ్యేట్లుంటే.. సరిగ్గా నెల రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సందడి మామూలుగా ఉండదు. రెండున్నరేళ్లకు పైగా విరామం తర్వాత పవన్ సినిమా వస్తుండటం.. అందులోనూ ఇది ‘గబ్బర్ సింగ్’ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఇప్పటికే ఆకాశాన్నంటుతున్నాయి. రాబోయే నెల రోజుల్లో అంచనాలు ఇంకా ఎంత పెరుగుతాయో అంచనా వేయడం కష్టం. రిలీజ్ డేట్ ను అందుకుంటారా అన్న విషయంలో కొంచెం సందేహాలున్నప్పటికీ ప్రస్తుతానికైతే ఏప్రిల్ 8నే సర్దార్ వచ్చేస్తాడన్న ఆశతో ఉన్నారు అభిమానులు.
ఇంతకీ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ప్రస్తుతం ఏ దశలో ఉందా అని ఆరా తీస్తే.. రెండు పాటలు మినహా షూటింగ్ అంతా దాదాపుగా పూర్తయిందని తెలిసింది. షూటింగ్ చివరి దశకు రాగానే ఎడిటింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలుపెట్టించేశాడట పవన్. కొన్ని రోజులుగా నెట్లో హల్ చల్ చేస్తున్న ఫొటో సైతం ఎడిటింగ్ టేబుల్ దగ్గర్నుంచి బయటికొచ్చిందే. మిగిలిన రెండు పాటల్ని పవన్, కాజల్ ల మీద స్విట్జర్లాండ్ లో షూట్ చేయాలని నిర్ణయించారు. ఈ నెల 20న ఆడియో వేడుక నిర్వహిస్తారని సమాచారం. మరి దాని కంటే ముందు స్విట్జర్లాండ్ వెళ్తారా.. తర్వాతా అన్నది తెలియడం లేదు. ఐతే ఏది ఎప్పుడు చేసినా.. ఎలా చేసినా.. ఏప్రిల్ 8న సినిమాను రిలీజ్ చేసి తీరాలన్న పట్టుదలతో ఉన్నాడట పవన్. మరి ఏం జరుగుతుందో చూద్దాం.