Begin typing your search above and press return to search.
పవన్ క్రిటిక్స్ కి ఛాన్సిచ్చేశాడు
By: Tupaki Desk | 17 March 2016 11:00 PM ISTనిజానికి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా కూడా దాని మీద సెటైర్లు వేయడానికి కొందరు క్రిటిక్స్ రెడీగా కాచుకునే ఉంటారు. మొన్న అనుపమ చోప్రాకు ఇచ్చిన ఇంటర్యూనే అవనివ్వండి లేకపోతే అప్పుడెప్పుడో జనసేన ఆవిర్భావ సభలో ఇచ్చిన స్పీచ్ కానివ్వండి.. సెటైర్ వేయకుండా మేము వదలం అంతే.
ఇప్పుడు ఆ బ్యాచ్ కు మరోసారి నిండా పని దొరికింది. పవన్ కళ్యాన్ ఒక కమెడియన్ పై చేయి చేసుకున్నాడు అనే న్యూస్ బయటకు రాగానే.. అది నిజమో కాదో కూడా వెరిఫై చేయకుండానే.. పవన్ తప్పు చేశాడు. .పవన్ తప్పే చేశాడు.. అంటూ వీరు అరవడం మొదలెట్టేశారు. అసలు పవన్ కేవలం వార్నింగ్ మాత్రమే ఇచ్చాడంతే అని చెప్పాగానే వీళ్ళు సైలెంట్ అయిపోయారు. మరో విషయం ఏంటంటే.. పవన్ కేవలం 2-3 సినిమాలు మాత్రమే చేసి రిటైర్ అవుతాను అని చెప్పి.. ఆ సినిమాలకు ఎక్కువ రేట్లకు అమ్మేస్తున్నారు అంటూ వీరు వడ్డనలు వడ్డిస్తున్నారు. మామూలుగా ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం.. పవన్ అలాంటి స్టేట్ మెంట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా.. ఆయన సినిమాలు 70-80 కోట్లకు అమ్ముడపోవడం పెద్ద విశేషం కాదే.
సర్లేండి.. ఏదైనా కూడా చాన్నాళ్ల తరువాత పవన్ క్రిటిక్స్ కు రెచ్చిపోమని మరోసారి ఛాన్సిచ్చేశాడు. ఇందుమూలంగా ఆయన సినిమాకు ఓపెనింగ్స్ పెరుగుతాయి మరి. అభిమానులు ప్రేమతో చూస్తే.. ఈ క్రిటిక్స్ కోపంతో చూస్తారు. ఏదేమైనా అందరూ సినిమా చూసి విపరీతమైన ఓపెనింగ్ వసూళ్లకు దోహదపడతారు. కాదంటారా?