Begin typing your search above and press return to search.
పవన్ కు నచ్చని పని మళ్లీ చేశారా?
By: Tupaki Desk | 11 April 2016 4:50 AM GMTపవన్ కు తప్పలేదు. తనకు నచ్చింది మాత్రమే చేయాలనుకునే పవర్ స్టార్ కు.. పరిస్థితులు ఆయన్ను మరోసారి ప్రభావితం చేశాయి. పని చేయటమే తప్పించి.. ఫలితం ఆశించటం అన్నది పవన్ కల్యాణ్ కు అస్సలు ఇష్టం ఉండదు. కానీ.. ఫలితాన్ని ప్రభావితం చేయటంలో పవన్ మాటలు ఉపయోగపడతాయంటే పవన్ మాట్లాడాల్సిందే. అదీ.. ఆయనకు నచ్చకున్నా. తాజాగా చోటు చేసుకున్న పరిణామం చూస్తే ఇలాంటిదే జరిగినట్లు కనిపిస్తుంది. ఏదైనా సినిమా విడుదల అవుతుందంటే.. సినిమా విడుదలకు ముందు.. విడుదల తర్వాత మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వటం మామూలే.
మిగిలిన సమయాల్లో మూడ్ లేకున్నా.. సమయం కుదరకున్నా.. సినిమా విడుదల సమయంలో మాత్రం సినిమాకు హైప్ తీసుకురావటం కోసం ఎవరైనా మాట్లాడాల్సిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు అలాంటి పరిస్థితే ఉంది. దీనికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మినహాయింపు అన్న మాట నిన్నటి వరకూ ఉండేది. ఇప్పుడిక అది లేనట్లే. ఎందుకంటే.. పవన్ సైతం పరిస్థితులకు తగ్గట్లు మారక తప్పలేదు. తన సినిమా విడుదల సందర్భంగా పవన్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వరు. ఇవ్వాల్సిన అవసరమే వస్తే.. తానే ఒక ఇంటర్వ్యూ ప్రీ రికార్డ్ చేయించి మీడియాకు అందిస్తుంటారు.
అయితే.. తాజాగా విడుదలైన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విషయంలో ఈ లెక్క కాస్త మారింది. సర్దార్ గబ్బర్ సింగ్ ఫలితం మీద రివ్యూలు ఏమాత్రం బాగా రాకపోవటం.. మూడో రోజు నుంచి కలెక్షన్ల మీద ప్రభావం కనిపించటంతో.. భారీగా ఖర్చు పెట్టి కొనేసిన వారి నుంచి హాహాకారాలు మొదలైనట్లు తెలుస్తోంది. పవన్ స్వయంగా రంగంలోకి దిగి.. పరిస్థితిలో ఎంతోకొంత మార్పు తేవాలన్న వినతులు పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యంలో.. తన స్టైల్ కి భిన్నంగా ఆదివారం కొన్ని ఎంపిక చేసిన మీడియా సంస్థల ప్రతినిధులతో పవన్ మాట్లాడారు. దాని ఫలితమే.. ఆదివారం సాయంత్రం నుంచి పవన్ కు సంబంధించిన వార్తలు మీడియాలో భారీగా కనిపిస్తున్నాయి. సోమవారం దినపత్రికల్లో పేజీలకు పేజీలు పవన్ ఇంటర్వ్యూలు రావటం వెనుక కూడా కారణం అదే. కాకుంటే.. ఇదంతా తనకు నచ్చకున్నా.. చేయక తప్పలేదన్న మాట వినిపిస్తోంది.