Begin typing your search above and press return to search.
చిరు.. పవన్.. ఓ వాటర్ బాటిల్
By: Tupaki Desk | 21 March 2016 11:30 AM GMTమెగాస్టార్-పవర్ స్టార్ కలయిక ప్రకంపనలు రేపుతోంది టాలీవుడ్లో. రాజకీయ వర్గాల్లోనూ ఈ రీయూనియన్ పెద్ద చర్చనీయాంశమవుతోంది. మూణ్నాలుగేళ్లుగా అన్నయ్యతో ఎడమొహం పెడమొహంగా ఉంటున్న పవన్.. నిన్న రాత్రి ‘సర్దార్ గబ్బర్ సింగ్’లో చిరు మీద చూపించిన ప్రేమ, గౌరవం.. ఆయనతో మెలిగిన తీరు మెగా అభిమానులకు అంతులేని ఆనందాన్ని కలిగించాయి. నిన్నటి అన్నదమ్ముల రీయూనియన్ లో అన్నిటికంటే విశేషం.. ఇద్దరూ కలిసి దిగిన సెల్ఫీయే. సోషల్ మీడియాలో ఇది మోస్ట్ సెలబ్రేటెడ్ సెల్ఫీ అయింది.
ఐతే ఆడియో వేడుక వేదిక మీద ఇంకో ప్రత్యేకమైన విషయం గురించి కూడా ప్రస్తావించాలి. మామూలుగా చూస్తే అది చిన్న విషయమే కానీ.. మెగా అభిమానులకు మాత్రం అది చాలా ప్రత్యేకంగానే కనిపించింది. చిరు వేదిక మీద అందరి కంటే సుదీర్ఘమైన ప్రసంగం చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 23 నిమిషాల పాటు ఆయన నిర్విరామంగా మాట్లాడారు. ఆ సమయంలో ఎంతో ఉద్వేగానికి కూడా లోనయ్యారు. ఎంతో ఉత్సాహంగా, ఉద్వేగంగా లౌడ్ వాయిస్ తో మాట్లాడ్డంతో చిరు గొంతు కొన్ని చోట్ల బొంగురుపోయింది.
ఐతే చిరు తొలిసారి కొంచెం ఇబ్బంది పడ్డట్లు కనిపించగానే పవన్ వెంటనే స్పందించి వాటర్ బాటిల్ తెప్పించాడు. అది అన్నయ్యకు ఇవ్వబోతే.. ఆయన ‘వద్దు నాన్నా’ అంటూ ప్రేమగా తమ్ముణ్ని వారించాడు. తర్వాత కూడా రెండుమూడుసార్లు చిరు గొంతు సవరించుకుంటుంటే.. పవన్ కంగారుగా వాటర్ బాటిల్ అందివ్వడానికి ప్రయత్నించాడు. కానీ చిరు అలాగే ప్రసంగాన్ని కొనసాగించాడు. చివరికి ఓ పావుగంట తర్వాత కాస్త ఆపి.. పవన్ దగ్గర వాటర్ బాటిల్ తీసుకుని నీళ్లు తాగాడు. ఆ సందర్భంలో ఆడిటోరియం హోరెత్తిపోయిందంతే.