Begin typing your search above and press return to search.
పవన్ తో అన్నా.. గంగా హారతిలో..
By: Tupaki Desk | 6 Dec 2017 11:57 AM GMTసినీ ఫీల్డ్ లో తారలకు షూటింగ్స్ ఉంటే ఎంత బిజీగా ఉంటారో ఖాళీ సమయం దొరికితే కుటుంబ సభ్యులతో కూడా అంతే బిజీగా హ్యాపీగా గడుపుతుంటారు. ఈ మధ్య కాలంలో మన స్టార్ హీరోలు ఫ్యామిలిస్ తో కలిసి విహార యాత్రలకు ఎక్కువగా వెళుతోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మెగాఫ్యామిలీకి చెందిన వారు. వారానికోసారి ఎదో ఒక ట్రిప్ తో బిజీ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా పుణ్యక్షేత్రలకు వెళితే వారి భార్య తో వెళుతుంటారు.
ఇక రీసెంట్ గా మెగా తనయుడు కూడా తన సతిమణితో కలిసి తిరుపతి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే అదే తరహాలో మెగా పవర్ స్టార్ కూడా తన భార్య అన్నా లెజినోవాతో వారణాసి వెళ్లారు. ఇటీవల అక్కడ అజ్ఞాతవాసి సినిమాలోని కొన్ని సీన్స్ ని దర్శకుడు త్రివిక్రమ్ చిత్రీకరించారు. టైటిల్ ఫస్ట్ లుక్ ను కూడా అక్కడే లంచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అక్కడికి అన్నా లెజినోవా కూడా వెళ్లారు.
పవన్ కళ్యాణ్ షూటింగ్ లకు అన్నా లెజినోవా చాలా తక్కువగా వస్తుంటారు. కొడుకు పుట్టిన తర్వాత మొదటి సారి ఆమె పవన్ షూటింగ్ స్పాట్ కి వచ్చి అనంతరం పవిత్ర గంగా నదిలో స్నానమాచరించి.. హారతి చేపట్టి.. అక్కడ శివుడికి ఇద్దరు పూజలను చేశారు. అక్కడికి విదేశీయులు రావడం కామన్. దీంతో ఎవరు అన్నా ని అంతగా పట్టించుకోలేదు. కానీ పవన్ కల్యాణ్ ని చూడటానికి మాత్రం చాలా మంది ఎగబడ్డారు. నార్త్ లో కూడా పవన్ ని ఇష్టపడేవారు చాలా మంది ఉన్నారు. అది సంగతి.