Begin typing your search above and press return to search.

సర్దార్‌ ఆడియో: మెగా హగ్‌ ఇచ్చిన వేళ

By:  Tupaki Desk   |   20 March 2016 3:53 PM GMT
సర్దార్‌ ఆడియో: మెగా హగ్‌ ఇచ్చిన వేళ
X
ఆ టైమొచ్చింది. ఇక అదే టైమయ్యింది. క్లీన్‌ షేవ్‌ తో.. క్యూట్‌ సాఫ్టువేర్‌ బాబులా పవన్‌ కళ్యాణ్‌ ఓ అరగంట ముందే ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ టైమ్‌ మరోసారి వచ్చింది. మళ్లీ అదే టైమయ్యింది. ఇప్పుడు వంతు అన్నయ్యది. ఈసారి మెగాస్టార్ చిరంజీవి మాసిన గెడ్డంతో.. కొత్త స్టయిలింగ్‌ తో.. రఫ్ఫాడిస్తూ నోవోటెల్‌ ఆడిటోరియంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇస్తూనే తన లుక్‌ తో అందరినీ మెస్మరయిజ్‌ చేశారు. చితక్కొట్టేశాడు.

అయితే వస్తూ వస్తూనే అందరూ మెగాస్టార్‌ కు నమస్తే అంటూ విషెస్‌ చెప్పేశారు. కాని మన దర్శకుడు త్రివిక్రమ్‌ మాత్రం.. ఏకంగా కాళ్ళకు నమస్కరించుకున్నాడు. ఇక పవన్‌ కళ్యాణ్‌ ఏం చేస్తాడు? యాజిటీజ్‌ గా.. అన్నయ్యకు ఒక సూపర్‌ హగ్‌ ఇచ్చేశాడు పవన్‌. చిరు కూడా చాలా అద్భుతంగా ఆప్యాయంగా అనురాగంగా తమ్ముడిని ఆలింగనం చేసుకున్నాడు. ఈ ''మెగా హగ్‌'' చూసి అందరూ షేకయ్యారంతే. అభిమానులు ఎప్పటినుండో వెయిటింగ్‌ చేస్తున్న ఆ హగ్‌ అదే. అదే. అదే. అదిరిపోయింది.