Begin typing your search above and press return to search.
బుల్లి తెర యాంకర్ గా పవర్ స్టార్
By: Tupaki Desk | 7 Jan 2016 10:20 AM GMTపవన్ కళ్యాణ్ పవర్ స్టార్ మాత్రమే కాదు.. పవర్ ఫుల్ పొలిటీషియన్ కూడా. ప్రస్తుతం తన కాన్సన్ ట్రేషన్ మొత్తాన్ని సర్దార్ గబ్బర్ సింగ్ పై పెట్టిన పవన్ కళ్యాణ్.. త్వరలో కొత్త పాత్రలోకి ఎంటర్ కానున్నాడని తెలుస్తోంది. బాబీ డైరెక్షన్ లో రూపొందుతున్న సర్దార్ షూటింగ్ కంప్లీట్ కాగానే.. బుల్లితెరపై యాంకర్ గా ప్రత్యక్షం కానున్నాడట పవన్.
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ చేసిన సత్యమేవ జయతే కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఎంత స్పందన వచ్చిందో చూశాం. దీన్ని డబ్బింగ్ చేసి దాదాపు దేశంలోని అన్ని భాషల్లోనూ టెలికాస్ట్ చేశారంటే.. ఈ ప్రోగ్రాంకి వచ్చిన రెస్పాన్స్ అర్ధమవుతుంది. ఇప్పుడు పవన్ కూడా ఇలాంటి ఒక సామాజిక కోణానికి చెందిన ప్రోగ్రాంనే చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇలా టీవీ ద్వారా ప్రజలకు నిత్యం టచ్ లో ఉండడం ద్వారా.. తన రాజకీయ ఇమేజ్ ను కూడా పెంచుకోవచ్చనే ఆలోచిస్తున్నాడట పవన్. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ గ్రూప్ ప్రసారం చేయనుందని సమాచారం. ఇప్పటికీ ఈనాడు గ్రూప్ కి పవన్ కి సన్నిహిత సంబంధాలు బాగానే ఉన్నాయి.
అసలు పవన్, చంద్రబాబుల కలయికలో కూడా ఈనాడు గ్రూప్ అధినేత రామోజీ రావు నడిపిన మంత్రాంగమే కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ తర్వాత.. పవన్ టీవీ ఎంట్రీ కూడా ఈనాడు గ్రూప్ ద్వారానే జరిగే అవకాశం ఉంది. మరోవైపు.. ప్రస్తుతం టీవీలో యాంకర్ గా సందడి చేస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున ఒక్కడే. గతంలో రాజమౌళి కూడా సత్యమేవజయతే కార్యక్రమాన్ని ప్రారంభించినా.. ఆ తర్వాత కొనసాగించలేదు. ఇప్పుడు పవన్ కూడా బుల్లితెర క్లబ్ లో జాయిన్ కానున్నాడు.