Begin typing your search above and press return to search.
పోలా.. సర్దార్ టైటిల్ సాంగ్ అదిరిపోలా
By: Tupaki Desk | 17 March 2016 7:44 AM GMT‘‘చూస్కో గురూ.. హల్ చల్ షురూ.. దూకాడురో ఖాకీ పాంథరూ.. రాస్కో గురూ ఈ చాప్టరూ.. న్యూ స్టయిలురో వీడి లా అండ్ ఆర్డరూ..’’
తెలుగు రాష్ట్రాల్లో ఇంకొన్ని రోజుల పాటు హల్ చల్ చేయబోయే పాట లిరిక్స్ ఇవి. ఇంతకీ ఏ సినిమాలో పాట ఇది అంటారా..? అదేనండీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఉంది కదా. దాని టైటిల్ సాంగే ఇది. కాసేపటి కిందట రిలీజైన ‘సర్దార్..’ ఆడియో టీజర్లో వినిపించిన హమ్మింగ్ ఈ పాటలోనిదే. అప్పట్లో ‘గబ్బర్ సింగ్’ టైటిల్ సాంగ్ తో ఉమ్మడి రాష్ట్రాన్ని ఓ ఊపు ఊపేసిన దేవిశ్రీ ప్రసాద్.. మరోసారి అదే ఎనర్జీతో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ టైటిల్ సాంగ్‌ను కంపోజ్ చేశాడు. క్యాచీగా ఉండే లిరిక్స్.. ఎంటర్ టైనింగ్ ట్యూన్.. వీటికి తగ్గట్లే బెన్నీ దయాల్ కూడా మాంచి ఎనర్జీతో పాట పాడి మోత పుట్టించాడు.
‘‘గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్.. హి ఈజ్ బ్యాక్ టు డు సంథింగ్’’ అంటూ మధ్య మధ్యలో దేవి హమ్మింగ్ మరింత హుషారెత్తిస్తోంది.
‘‘హంజో బోలా సహీహై.. సంజో ఫైనల్ వహీ హై..
నేను నిలుచున్న ప్లేసు ఏదైనా స్టేషనైపోద్దిరో..
మేరా గన్ మే హుదా హై.. యేతో సబ్ కో పతా హై..
దానికెదురైతే రైటు సైడైనా రాంగు సైడిపోద్దిరో..
స్కేలుపై కొలిచేదెలా వీడి అడుగుల్లో భూకంపం..
గుండెపై పిడుగే కదా.. వీడి గన్ను శబ్ధం..’’
ఇది తొలి చరణం.
‘‘డేంజరంటుంది చూడు.. మెడలోని ఎర్ర తుండు..
ట్వంటీ ఫోర్ సెవెను బుల్లెట్ ప్రూఫల్లె ఉందిరో యూనిఫామ్
ప్యూరు పోలీసు బ్లడ్డు.. వీడు పోలీసు కొడితే బాడీలు షెడ్డు
చట్టమూ నేనే సిస్టమూ నేనే రిపేరే మేరా కామ్
రూల్సుని న్యూసెన్సని గిరాటు వేస్తాడు డస్ట్ బిన్లో
ఘాటుగా ఇస్ట్రైటుగా వెళ్తాడు కొత్త వేలో’’
ఇది రెండో చరణం.
ఒక్క మాటలో చెప్పాలంటే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ టైటిల్ సాంగ్ కెవ్వు కేక.