Begin typing your search above and press return to search.
పవన్ కళ్యాణ్ ఆ ప్రొడక్షన్ హౌసెస్ లో పెట్టుబడులు పెడుతున్నాడా..?
By: Tupaki Desk | 3 Jan 2021 3:30 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించాలని అలా అనుకున్నాడో లేదో వరుసపెట్టి కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. 'అజ్ఞాతవాసి' చిత్రం తర్వాత సినిమాలకు దూరమైన పవన్.. ఒక్క సినిమాలో నటిస్తే చాలు అనుకున్న ఫ్యాన్స్ కి అర డజను సినిమాలను అందించడానికి ప్లాన్ చేసుకున్నాడు. వచ్చే ఎలక్షన్స్ లోపల వీలైనన్ని సినిమాలు చేయాలని డిసైడైన పవన్.. 'వకీల్ సాబ్' - క్రిష్ సినిమా - అయ్యప్పనుమ్ కోశీయుమ్ రీమేక్ - హరీష్ శంకర్ ప్రాజెక్ట్ - సురేందర్ రెడ్డి సినిమా - బండ్ల గణేష్ ప్రొడక్షన్ లో సినిమాలను లైన్ లో పెట్టాడు.
ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమాల కోసం భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే పవన్ తనకొచ్చే పారితోషికాల్లో దాదాపు 40 శాతాన్ని వివిధ ప్రొడక్షన్ హౌసెస్ లో పెట్టుబడిగా పెడుతున్నాడని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. పవర్ స్టార్ కి సన్నిహితంగా ఉండే ఎస్. ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ - సితార ఎంటర్టైన్మెంట్స్ - హారికా అండ్ హాసిని చేయబోయే సినిమాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడట. అలానే రామ్ చరణ్ నిర్వహిస్తున్న కొణిదెల ప్రొడక్షన్స్ లో కూడా పవన్ పెట్టుబడులు పెడుతున్నాడట. అయితే ఇదంతా ఫైనాన్స్ మాత్రమే అని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంతో మరి..!