Begin typing your search above and press return to search.

చిరు సినిమా విషయంలో పవన్ జోక్యం!

By:  Tupaki Desk   |   15 March 2016 5:17 AM GMT
చిరు సినిమా విషయంలో పవన్ జోక్యం!
X
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఎప్పుడు సెట్స్ మీదకి వెళుతుందో నిజంగా ఇంకా ఎవరికీ అంతుపట్టని రహస్యంగానే ఉన్నా సినిమాపై మాత్రం రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది. చిరంజీవి కూతురు శ్రీజ వివాహం ఈ నెల 28 అనంతరం మెగా స్టార్ తన పూర్తి సమయాన్ని ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలకే కేటాయించాలని నిర్ణయించుకున్నాడు. ఏప్రిల్ మూడవవారానికి స్క్రిప్ట్ రెడీ చేసి నిర్విరామంగా చిత్రీకరణ జరిపి నవంబర్ సమయానికి మొదటికాపీ రెడీ చేయాలనే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి మరో వార్త ప్రచారంలోకి వచ్చింది.

మెగా బ్రదర్స్ చిరంజీవి - పవన్ ల మధ్య విబేధాలు తొలగిపోయి ఒక్కటయిపోయారు. రీసెంట్ గా చిరు 'సర్దార్' సినిమా సెట్ కు వెళ్లి సినిమా ఎలా వస్తుందో..? చూసుకొని వచ్చారు. అయితే ఇప్పుడు అన్న‌య్య సినిమా బాధ్య‌త‌ల్ని త‌మ్ముడు మోయ‌నున్నాడ‌ని టాక్‌. ఈ చిత్రానికి రామ్‌ చ‌ర‌ణ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తార‌ని అప్ప‌ట్లో చెప్పుకొన్నారు. అయితే... ఠాగూర్ మ‌ధుకి ఆ అవ‌కాశం ద‌క్కింది. బయట నుండైనా.. సినిమా నిర్మాణ బాధ్యతలు చుసుకొందాం అనుకున్నాడు చరణ్. కానీ.. ప‌వ‌న్ ఆ అవ‌కాశం ఇవ్వ‌డం లేదు. త‌న అన్న‌య్య సినిమాకి సంబంధించిన అన్ని విష‌యాన్నీ త‌నే ద‌గ్గ‌రుండి చూసుకోవాల‌ని డిసైడ్ అయ్యాడ‌ట‌. మ‌రీ ముఖ్యంగా పాట‌లు, ఫైట్స్ విషయాల్లో ప‌వ‌న్ జోక్యం చేసుకోబోతున్నాడ‌ని టాక్‌. మరి తమ్ముడు సినిమా బాధ్యతలు చూసుకుంటానంటే చిరు కాదంటాడా.. లేదో చూడాలి..!