Begin typing your search above and press return to search.
‘పింక్’ గౌరవం తగ్గిపోయిందా?
By: Tupaki Desk | 11 April 2021 11:01 AM GMT‘పింక్’ రీమేక్‌లో పవన్ కళ్యాణ్ హీరో అన్నప్పటి నుంచి.. బాలీవుడ్లో క్లాసిక్‌గా పేరు తెచ్చుకున్న సినిమాను చెడగొట్టేస్తున్నారంటూ ఒక వర్గం అభ్యంతరాలు మొదలుపెట్టేసింది. ఇక ఈ చిత్రానికి ‘వకీల్ సాబ్’ అనే హీరోను ఎలివేట్ చేసే టైటిల్ పెట్టడం, ఒక మాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం.. ఆ తర్వాత రిలీజ్ చేసిన ప్రోమోలన్నింట్లో కూడా పవన్ కళ్యాణే హైలైట్ కావడంతో ఈ అభ్యంతరాలు మరింత ఎక్కువ అయిపోయాయి. ‘పింక్’ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గొడవ గొడవ చేసేశారు. హిందీ జనాలు ఈ సినిమాపై వెటకారాలు కూడా చేశారు. వాళ్లకు పవన్ యాంటీ ఫ్యాన్స్ కూడా తోడై సోషల్ మీడియాలో రచ్చ చేశారు. కట్ చేస్తే ఇప్పుడు ‘వకీల్ సాబ్’ థియేటర్లలోకి దిగింది. ఇంతకుముందు అభ్యంతరాలు వ్యక్తం చేసిన వాళ్లకు సినిమా చూసి ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి తలెత్తింది. ఎందుకంటే ‘వకీల్ సాబ్’.. ‘పింక్’ గౌరవాన్ని ఏమాత్రం తగ్గించలేదు. ఇంకా చెప్పాలంటే ఆ సినిమా మెసేజ్‌ను మరింతగా జనాల్లోకి తీసుకెళ్లింది.
పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో ఉండే అంచనాలు వేరు. అభిమానులు ఆశించే అంశాలు వేరు. ఆయనకు భారీ పారితోషకం ఇచ్చి, పెద్ద బడ్జెట్ పెట్టాక ‘పింక్’ను ఉన్నదున్నట్లు తీస్తే చాలా కష్టమవుతుంది. కాబట్టి పవన్‌ను హైలైట్ చేయడానికి ఏం చేయాలో అంతా చేశారు. అభిమానుల కోసమే ఆయన పాత్రకు ఫ్లాష్ బ్యాక్ పెట్టారు. దాని వల్ల ఫ్లో కొంచెం దెబ్బ తిన్నప్పటికీ.. సినిమాకు చేటైతే జరగలేదు. ‘పింక్’ మూలకథను ఏమీ మార్చలేదు. ఏ సన్నివేశమూ తీయలేదు. కాకపోతే కోర్ట్ రూం డ్రామా హిందీలో సటిల్‌గా, సైలెంటుగా సాగిపోతే.. ఇక్కడ ఆ సన్నివేశాలను మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా లౌడ్‌గా చెప్పారు. వాటిలోనూ పవన్ హైలైట్ అయ్యేలా చూశారు. అంతే తప్ప ‘పింక్’ను చెడగొట్టిందేమీ లేదు. పవన్ చేయడం వల్ల ఈ కథకు రీచ్ పెరిగింది. మెసేజ్ ఎక్కువ మంది జనాలకు చేరింది. ఆ రకంగా చూస్తే ‘పింక్’కు ‘వకీల్ సాబ్’ ఇంకా మంచి చేసినట్లే. ఇక ‘పింక్’ ఫుల్ రన్లో సాధించిన వసూళ్లను ‘వకీల్ సాబ్’ తొలి రోజే సాధించడం గమనార్హం.