Begin typing your search above and press return to search.

మెగాస్టార్ ని పవన్ పొగిడేది అందుకేనా?

By:  Tupaki Desk   |   26 March 2016 6:46 AM GMT
మెగాస్టార్ ని పవన్ పొగిడేది అందుకేనా?
X
మెగాస్టార్ అంటే నాకు పిచ్చి అంటున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి అంటే పవన్ కళ్యాణ్ కి బోలెడంత అభిమానం - ఆరాధన - ప్రేమ. మరి.. పిచ్చి ఎక్కడనుంచి వచ్చిందనే ప్రశ్న ఆటోమేటిగ్గా వస్తుంది. అయితే అన్నయ్య మెగాస్టార్ అంటే పవన్ కి ఆరాధనే కానీ.. ఈ పిచ్చి అభిమానం మాత్రం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గురించే. గతంలో గబ్బర్ సింగ్ సినిమాలో కూడా షోలే సన్నివేశాలను చూపించి.. తనే విలన్ గబ్బర్ సింగ్ అంటూ పేరు కూడా పెట్టేసుకున్న కేరక్టర్ చేశాడు పవన్

ఇప్పుడు చేస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ లో కూడా అమితాబ్ పై అభిమానం ప్రదర్శిస్తున్నాడు పవన్. మిస్టర్ నట్వర్ లాల్ అనే పోస్టర్ పవన్ కి పక్కగా కనిపిస్తుంది. దీనిపై పవన్ పెద్ద వివరణే ఇచ్చాడు. 'నాకు అమితాబ్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఇంకా చెప్పాలంటే పిచ్చి అభిమానం. నేను ఎనిమిదో క్లాస్ లో ఉండగా తొలిసారిగా బిగ్ బీ ని కలిశాను. అప్పుడాయన మహాన్ షూటింగ్ లో ఉన్నారు' అని చెప్పాడు పవన్.

"అన్నయ్య చిరంజీవితో సినిమా తీస్తున్న ప్రొడ్యూసరే.. మహాన్ కి కూడా నిర్మాత. అలా అమితాబ్ బచ్చన్ ని కలిసే అవకాశం వచ్చింది. నేను వ్యక్తిగతంగా ఆయన్ని కలిసిన అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పటికీ ఆయన చేతుల చల్లదనం.. నాకు గుర్తుంది. ఆ మధుర క్షణాలను నేను నా మనసులో ఎప్పటికీ దాచుకున్నాను'' అంటూ చెప్పాడు పవన్. ఇంతకీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు అమితాబ్ ని పొగడ్డం.. సర్దార్ హిందీ వెర్షన్ ప్రమోషన్ కోసమే అనే టాక్ వినిపిస్తోంది.