Begin typing your search above and press return to search.

పవన్‌ కళ్యాణ్‌.. అన్నీ పెర్ఫెక్ట్‌గా..

By:  Tupaki Desk   |   26 Jun 2015 7:30 AM GMT
పవన్‌ కళ్యాణ్‌.. అన్నీ పెర్ఫెక్ట్‌గా..
X
ప్రతిదీ పెర్ఫెక్ట్‌గా ఉండాలనుకుంటే పెర్ఫెక్షనిజం అంటారు. పెర్ఫెక్ట్‌ పెర్ఫెక్ట్‌ అంటూ పాకులాడేవాళ్లను పెర్ఫెక్షనిస్ట్‌ అంటారు. అలా పెర్ఫెక్షన్‌ కోసం ప్రయత్నించే హీరోలు మనకు ఎంతమంది ఉన్నారు? స్టయిల్‌ కోసం పాకులాడే హీరో కాబట్టి స్టయిలిష్‌ పెర్ఫెక్షనిస్ట్‌ అని బన్నీని అనాలి. ఎవరు అన్నా అనకపోయినా ప్రభాస్‌ ఎలానూ మిస్టర్‌ పెర్ఫెక్టే.

అయితే ఈ ఇద్దరినీ మించిన పెర్ఫెక్షనిస్ట్‌ ఇంకొకరున్నారు. ఆయనే పవన్‌ కల్యాణ్‌. పవర్‌స్టార్‌ ఆన్‌సెట్స్‌ వెళ్లినప్పట్నుంచి ప్రతిదీ పెర్ఫెక్ట్‌గా ఉండాలని కోరుకుంటారట. షాట్‌కి వెళ్లే ముందు ప్రతిదీ పెర్ఫెక్ట్‌గా ఉందా? లేదా? అనేది చెక్‌ చేసుకుని మరీ వెళతారు. కారవ్యానులో కూచున్నంత మాత్రాన ఆయన ఏదీ పట్టించుకోడు.. అనుకుంటే పప్పులో కాలేసినట్టే. కాస్ట్యూమ్స్‌, సెట్‌ డిజైన్‌ నుంచి ప్రతిదీ పెర్ఫెక్ట్‌గా ఉండాలని పవన్‌ కోరుకుంటారు. సహ నటీనటులంతా పెర్ఫెక్ట్‌గా ఎవరి పనిలో వాళ్లు ఒదిగిపోతున్నారా? లేదా? అనేది పరిశీలిస్తాడు.

అంతేనా.. ఈయనకు ఇంకో అరుదైన అలవాటు కూడా ఉంది. ఏదో స్క్రిప్టు పూర్తి చేసేశాం కదా! అని రచయితలు అనుకుంటే అది వాళ్ల పొరపాటు. పవన్‌ సినిమాకి పనిచేసే రైటర్‌ మస్ట్‌ అండ్‌ షుడ్‌గా ఆన్‌సెట్స్‌లో ఉండాల్సిందే. అప్పటికప్పుడు మాట్లాడే డైలాగ్‌లో ఎలాంటి తేడా రాకుండా సరిచేయాల్సిందే. అవసరాన్ని బట్టి అప్పటికప్పుడే ఏదైనా యాక్సెంట్‌ వగైరా సవరించాల్సి ఉంటుంది. ఎలా చెబితే బావుంటుందో రైటరే సూచించాలి.

ప్రస్తుతం గబ్బర్‌సింగ్‌ 2 ఆన్‌సెట్స్‌ కూడా రైటర్‌ పవన్‌ చెంతనే ఉన్నారు. ఈ చిత్రానికి కృష్ణం వందే జగద్గురుమ్‌ రైటర్‌ బుర్రా సాయిమాధవ్‌ రచయితగా పనిచేస్తున్నారు. పవన్‌కి అన్నీ దగ్గరుండి ఆయనే చూసుకుంటున్నారు. సంభాషణల వరకూ ఎలాంటి లోపం లేకుండా జాగ్రత్త ఈయనదే. అలాగే ప్రతి డిపార్ట్‌మెంట్‌ అంతే అలెర్టుగా ఉండాలనేది పవన్‌ అభిలాష అని ఆన్‌సెట్స్‌ చూసినవాళ్లు చెబుతున్నారు. అదీ సంగతి.