Begin typing your search above and press return to search.
కాటమరాయుడు మోత మోగించేస్తున్నాడు
By: Tupaki Desk | 13 March 2017 7:09 AM GMT‘కాటమరాయుడు’ సినిమా మొదలైపుడు అంతగా హైప్ లేదు. కొన్ని షూటింగ్ షెడ్యూళ్లు అయ్యాక కూడా ఊపు కనిపించలేదు. నూతన సంవత్సర కానుకగా వరుసబెట్టి పవన్ లుక్స్ రిలీజ్ చేసినపుడు కూడా రెస్పాన్స్ అంతంతమాత్రంగానే కనిపించింది. కానీ గత నెల ‘కాటమరాయుడు’ టీజర్ వచ్చాక మాత్రం సీన్ మారిపోయింది. ఉన్నట్లుండి సినిమాపై హైప్ పెరిగిపోయింది. అంతకుముందు వరకు బిజినెస్ కూడా అనుకున్నట్లుగా జరగలేదు. కానీ ఆ తర్వాత సినిమాను భారీ రేట్లకు కొన్నారు. థియేట్రికల్ బిజినెస్ అనూహ్యమైన స్థాయిలో జరిగింది. ఇప్పుడీ సినిమా సేఫ్ వెంచర్ కావాలంటే ఓపెనింగ్స్ భారీగా రావాలి. ఆల్రెడీ సినిమాపై హైప్ బాగానే ఉండగా.. దాన్ని మరింతగా పెంచే ప్రయత్నంలో పడింది ‘కాటమరాయుడు’ టీం.
పవన్ గత సినిమాల్లో వేటికీ లేనంతగా ‘కాటమరాయుడు’కు పబ్లిసిటీ చేస్తున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఎక్కడ చూసినా కాటమరాయుడు హోర్డింగులు.. ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో పబ్లిసిటీ కొంచెం పెద్ద స్థాయిలోనే నడుస్తోంది. పెద్ద కూడళ్లలో భారీ హోర్డింగులు.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల ఆల్రెడీ భారీ కటౌట్లు కూడా రెడీ అయిపోయాయి. ‘కాటమరాయుడు’ కోసం పవన్ ఎంచుకున్న లుక్.. అతడి ఆహార్యం చాలా బాగా కుదిరాయి. దీంతో ఫ్లెక్సీలు.. హోర్డింగులు భలేగా అనిపిస్తున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో తరచుగా ‘కాటమరాయుడు’ కొత్త స్టిల్స్ రిలీజ్ చేస్తున్నారు. అవి కూడా సినిమాపై పాజిటివ్ బజ్ తీసుకొస్తున్నాయి. మూణ్నాలుగు రోజులకో పాట రిలీజ్ చేస్తూ ఆ రకంగా కూడా సినిమాను వార్తల్లో నిలబెడుతున్నారు. ఈ నెల 18న ప్రి రిలీజ్ ఈవెంట్ చేశాక ‘కాటమరాయుడు’పై హైప్ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/