Begin typing your search above and press return to search.
కాటమరాయుడికి పెద్ద పంచే పడిందిగా..
By: Tupaki Desk | 26 March 2017 11:11 AM GMTఅమెరికన్ తెలుగు సినిమా మార్కెట్లో మంచి పట్టు ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకడు. అక్కడ పవన్ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తుంటాయి. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే వసూళ్ల మోత మోగుతుంది. అప్పట్లో ‘అత్తారింటి దారేది’ సినిమా టాలీవుడ్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించింది. గత ఏడాది ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాకు కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ సినిమాకు నెగెటివ్ టాక్ రావడం వల్ల ఆ తర్వాత కలెక్షన్లు డ్రాపయ్యాయి. ఐతే పవన్ లేటెస్ట్ మూవీ ‘కాటమరాయుడు’కు రిలీజ్ ముంగిట మంచి హైప్ వచ్చిన నేపథ్యంలో ఓపెనింగ్స్ అదిరిపోతాయని ఆశించారు.
ఏకంగా 250 స్క్రీన్లలో ‘కాటమరాయుడు’ సినిమాను రిలీజ్ చేశారు. ఇది నాన్-బాహుబలి రికార్డు. దీంతో ఈ చిత్రం ప్రిమియర్లతోనే మిలియన్ డాలర్ల వసూళ్లు కొట్టేస్తుందని ఆశించారు అభిమానులు. కానీ ప్రిమియర్లతో పాటు తొలి రోజు వసూళ్లను కలిపినా మిలియన్ డాలర్ల మార్కును అందుకోలేదు. గురు-శుక్రవారాలు రెండూ కలిపితే ఈ చిత్రానికి 6.67 లక్షల డాలర్లు వసూలయ్యాయంతే. సినిమా మీద ఉన్న హైప్.. రిలీజ్ చేసిన థియేటర్ల ప్రకారం చూస్తే ఇవి పూర్ ఓపెనింగ్సే. అందులోనూ సినిమాకు డివైడ్ టాక్ ఉన్న నేపథ్యంలో సినిమా అక్కడ ఫుల్ రన్లో మిలియన్ డాలర్ మార్కును దాటి ఎంతో దూరం ట్రావెల్ చేసేలా లేదు. కానీ అక్కడి బయ్యర్ సినిమాపై భారీ పెట్టుబడే పెట్టాడు. వీకెండ్ తర్వాత ఈ సినిమా నిలబడకపోతే భారీ నష్టాలు తప్పవేమో.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/