Begin typing your search above and press return to search.

పవన్ 'కోహినూర్' దొంగ.. వీరమల్లు సీన్స్ అదుర్స్..!

By:  Tupaki Desk   |   10 Jan 2023 8:23 AM GMT
పవన్ కోహినూర్ దొంగ.. వీరమల్లు సీన్స్ అదుర్స్..!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబోలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సినిమా హరి హర వీరమల్లు. ఈ సినిమాను ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక బందిపోటు దొంగ గా కనిపిస్తారని టాక్. ఇక ఈ సినిమా కథ 17వ శతాబ్దం ఔరంగజేబు సామ్రాజ్యం నాటి నేపథ్యంతో వస్తుంది. సినిమాలో పవన్ ఇదివరకు ఎప్పుడూ చూడని విధంగా లుక్స్, యాక్షన్ తో కనిపిస్తారని తెలుస్తుంది.

ఇక సినిమాలో పవన్ దొంగ గా కోహినూర్ వజ్రాన్ని దొంగిలిస్తారట. ఔరంగజేబు సామ్రాజ్యంలో ఉన్న కోహినూర్ ను పథకం ప్రకారం వీరమల్లు తన సొంతం చేసుకుంటారట. ఈ సీన్స్ సినిమాలో చాలా స్పెషల్ గా సినిమాకు హైలెట్ గా ఉంటాయని తెలుస్తుంది. క్రిష్ ఈ సినిమాను చాలా ఫోకస్ తో తెరకెక్కిస్తున్నారు. పవన్ కెరీర్ లో డిఫరెంట్ మూవీగా హరి హర వీరమల్లు సినిమా వస్తుంది.

సినిమా అంతా ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతి అందిస్తుందని అంటున్నారు. ప్రేక్షకులకు కావాల్సిన వినోదం తో పాటుగా 17వ శతాబ్దం నాటి కథను కూడా క్రిష్ ఈ సినిమాతో చెప్పబోతున్నారు. సినిమాలో హీరోయిన్స్ గా నిధి అగర్వాల్, జాక్వెలిన్ నటిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహి కూడా ఈ సినిమాలో స్పెషల్ రోల్ లో నటిస్తుందని తెలుస్తుంది.

పవన్ ఈ సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉన్నాడని తెలుస్తుంది. నిర్మాత ఏ.ఎం రత్నం కూడా సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెడుతున్నారు. పవన్ హరి హర వీరమల్లు సినిమా పాన్ ఇండియా మూవీగా వస్తుంది. సినిమా తప్పకుండా ప్రేక్షకుల అంచనాలకు తగినట్టుగానే ఉంటుందని చెప్పొచ్చు. సినిమాలో ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ నటిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.