Begin typing your search above and press return to search.

#PSPK27 ఇంత‌లోనే గుట్టు చ‌ప్పుడు కాకుండానే

By:  Tupaki Desk   |   29 Jan 2020 7:05 AM GMT
#PSPK27 ఇంత‌లోనే గుట్టు చ‌ప్పుడు కాకుండానే
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇస్పీడ్ చూస్తుంటే ఎవ‌రైనా షాక్ తినాల్సిందే. వెంట వెంట‌నే ఒక‌దాని వెంట ఒక‌టిగా ముహూర్తాలు చేసేస్తూ .. షూటింగుల‌తో క్ష‌ణ తీరిక లేనంత బిజీ అయిపోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఇదిగో పులి అంటే అదిగో మేక‌! అన్న స‌న్నివేశం లేదిప్పుడు. అదిగో పులి అన‌డ‌మే ఆల‌స్యం క‌ళ్ల ముందే ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టుగానే ఉంది సీను. మొన్న‌టికి మొన్న ఇలా పింక్ రీమేక్ షూటింగ్ సైలెంటు గా మొద‌లు పెట్టేసిన ప‌వ‌న్ .. ఈ గురువారం పీఎస్.పీకే 27కు ముహూర్తం చేస్తార‌ని ఇంత‌కుముందు ప్ర‌చార‌మైంది.

అయితే గురువారం ముహూర్తం లేనే లేదు. గుట్టు చ‌ప్పుడు కాకుండా నేడు (బుధ‌వారం) సైలెంటుగా ఈ సినిమా ని పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించేయ‌డం.. ఈ కార్య‌క్ర‌మానికి ప‌వ‌న్ హాజ‌ర‌వ్వ‌డం షాక్ కి గురి చేస్తోంది. ఫ్యాన్స్ కి ఇది స‌డెన్ ట్విస్ట్ అనే చెప్పాలి. ఈరోజు కాదు రేపు ప‌వ‌న్ 27 చిత్రం మొద‌ల‌వుతుంది అంటూ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాల్లో ప్ర‌చార‌మైంది. ఆ ప్ర‌చారానికి ప‌వ‌న్ ఇలా స‌డెన్ గా చెక్ పెట్టేశారు.

ఒక ర‌కంగా ప‌వ‌న్ ఒక‌దాని వెంట ఒక‌టిగా షాక్ లిస్తున్నారు. ఇస్పీడ్ చూస్తుంటే ఇక ప‌వ‌ర్ స్టార్ ని ఆప‌డం క‌ష్ట‌మేన‌ని చెప్పాలి. దాదాపు వంద కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రానికి క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఏ.ఎం.ర‌త్నం అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఇదో హిస్టారిక‌ల్ వారియ‌ర్ క‌థాంశం అన్న ప్ర‌చారం ఇప్ప‌టికే సాగుతోంది. పాన్ ఇండియా కేట‌గిరీలో అన్ని భాష‌ల్లోనూ సినిమాని రిలీజ్ చేయ‌నున్నారు. ఫిబ్ర‌వ‌రి 4 నుంచి రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌ను ప్రారంభించి హైద‌రాబాద్ అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో తొలి షెడ్యూల్ ని తెర‌కెక్కించ‌నున్నారు. ఎం.ఎం.కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.