Begin typing your search above and press return to search.
#PSPK27 ముహూర్తం ఫిక్స్.. ఇక డబుల్ స్పీడ్
By: Tupaki Desk | 29 Jan 2020 5:42 AM GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ `లాయర్ సాబ్` (PSPK26) చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో విజయం సాధించిన `పింక్`కి రీమేక్ ఇది. ఇటీవలే రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించారు. ప్రస్తుతం పవన్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే.. వెంటనే PSPK27 చిత్రాన్ని క్రిష్ దర్శకత్వంలో ప్రారంభించనున్నారు. వాస్తవానికి ఈనెల 27న సినిమా ప్రారంభం కావాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల వీలు పడలేదు. తాజాగా ఆ సినిమా లాంచ్ కి ముహూర్తం పిక్స్ చేసారు. ఈనెల 30న అంటే ఈ గురువారం ఉదయం ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్ గా ఠెంకాయ కొట్టి ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. సంస్థ కార్యాలయం లోనే మీడియా కు ఆహ్వానం లేకుండా పూజా కార్యక్రమం చేస్తారని ఓ సెక్షన్ ప్రచారం చేస్తోంది. అలా కాదు.. రేపు ప్రారంభమవుతున్న మాట వాస్తవం.. అయితే అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ ప్రారంభోత్సవం ఉంటుందని వేరొక సోర్స్ చెబుతోంది.
ఏదేమైనా వరుస సినిమాలతో గురుడు స్పీడ్ మీద ఉండడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఇన్నాళ్లు పవన్ తిరిగి సినిమాల్లోకి వస్తారా.. రారా? అనే సందేహాలుండేవి. పింక్ రీమేక్ ని ప్రారంభించి అన్ని సందేహాలు తొలగించారు. ఇక క్రిష్ సినిమాకి పవన్ రెడీ అవుతుండడం చూస్తుంటే ఇక వరుసగా సినిమాలు చేస్తారనే భావించాల్సి ఉంటుంది. అయితే ఒకేసారి రెండు సినిమాలు ప్రారంభించడంతో పవన్ ఏకధాటిగా రెండు సినిమా షూటింగ్ లకు ఒకేసారి హజారవుతారా అన్నది చూడాలి.
లాయర్ సాబ్ కు పవన్ కేవలం 30 కాల్షీట్లు మాత్రమే కేటాయించినట్లు ఇప్పటికే ప్రచారం ఉంది. ఎట్టిపరిస్థితుల్లో 30 రోజుల లోపే తన పార్టుకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేయాలని పవన్ ఆదేశాలిచ్చారుట. కాబట్టి యూనిట్ పవన్ ఆదేశాల మేరకు ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఆ రకంగా చూసుకుంటే పవన్ లాయర్ సాబ్ కోసం డే అండ్ నైట్ శ్రమించడానికి సిద్ధమయ్యారనే అర్థమవుతోంది. ఉదయం పూట రాజకీయాలకు కేటాయించారు కాబట్టి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ షూటింగులోనే ఉంటారన్నమాట. ఆ సినిమా పూర్తయితే.. పవన్ 27 వ సినిమా రెగ్యులర్ షూట్ పై క్లారిటీ వచ్చే అవకాశం కూడా లేదు. ఈ చిత్రాన్ని ఏ.ఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఈ గురువారం పవన్ 27వ సినిమాని హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో ప్రారంభించి అటు పై ఫిబ్రవరి తొలి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారట. 2021 సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేయడమే ధ్యేయంగా క్రిష్ పూర్తి చేయనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా ఓ కథానాయికగా ఎంపికైందని.. ప్రగ్య జైశ్వాల్ వేరొక పాత్రకు ఓకే అయ్యిందని ప్రచారమవుతోంది.