Begin typing your search above and press return to search.
PSPK27 పడవలో కోహినూర్ ఎత్తుకెళతాడా?
By: Tupaki Desk | 19 Feb 2020 2:30 PM GMTభారతదేశ సంపదను ఆంగ్లేయులు సముద్ర మార్గం గుండానే ఎత్తుకెళ్లారు. లాట్లు దోచుకెళ్లారు. ఇక్కడ సుగంధ ద్రవ్యాలు మొదలు భారతదేశానికి మణిమకుటంగా చెప్పుకునే ఖరీదైన కోహినూర్ వజ్రం.. నెమలి సింహాసనం వంటివి ఇలానే తస్కరించారు ఇంగ్లీష్ వాళ్లు. సముద్ర మార్గంలో పడవల్లో మన సంపదల్ని తరలించుకుని వెళ్లారు. అయితే అలా దొంగిలించుకుని వెళ్లేందుకు సాయపడింది కూడా భారతీయులేనా? అసలు కోహినూర్ దొంగతనం ఎలా జరిగింది? అన్నదానికి సమాధానంగానే డైరెక్టర్ క్రిష్ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ తో పీఎస్.పీకే 27 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే మొదటి షెడ్యూల్ ని తెరకెక్కిస్తున్నారు. త్వరలో అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన పడవ సెట్ లో కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారట. కోహినూర్ వజ్రం దొంగతనం నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. చక్రవర్తి షాజహాన్ కొలువులో ఉన్న కోహినూర్ ని కొట్టేయాలన్న బంధిపోటు దొంగల ముఠా నాయకుడిగా పవన్ కనిపిస్తారట. పడవలో పవన్ పైనే సన్నివేశాలు తెరకెక్కనున్నాయని తెలుస్తోంది.
ఇన్నాళ్లలో కోహినూర్ వజ్రాన్ని విదేశీయులు ఎలా దోచుకెళ్లారు? అన్నదానికి విజువల్ రూపం ఏమిటో ఎవరికీ తెలీదు. మనదైన సంపదను దోచుకెళ్లారని మాత్రమే తెలుసు. అయితే క్రిష్ చేస్తున్న ఈ ప్రయత్నంతో అలాంటి వండర్ ని ప్రత్యక్షంగా చూసే అవకాశం కలుగుతోంది. కథాంశం యూనివర్శల్ అప్పీల్ తో నే కనిపిస్తోంది. ఇక గౌతమి పుత్ర శాతకర్ణి (బాలయ్య 100వ మూవీ) ని మించిన ఎమోషన్ ని రగిలిస్తూ పవర్ స్టార్ తో మ్యాజిక్ చేస్తాడా లేదా? అన్నది మాత్రం చూడాలి. సినిమా ఆద్యంతం దేశభక్తి ఎలిమెంట్.. ఎమోషన్ .. రొమాన్స్ .. సెంటిమెంట్ .. వీటన్నిటినీ రంగరిస్తూ రక్తి కట్టిస్తాడేమో చూడాలి. హిస్టరీ నేపథ్యం అంటే క్యూరియాసిటీ ఉంటుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రయత్నమే కాబట్టి ఎలాంటి మ్యాజిక్ చేస్తారు? అన్నది చూడాలి.