Begin typing your search above and press return to search.

తమ్ముళ్లతో పవన్ డిన్నర్ చేస్తుంటే

By:  Tupaki Desk   |   20 Dec 2016 5:30 PM GMT
తమ్ముళ్లతో పవన్ డిన్నర్ చేస్తుంటే
X
మెగాబ్రదర్స్ లో పవన్ కళ్యాణ్ చిన్న తమ్ముడు. మరి పవన్ కి తమ్ముళ్లు ఎవరబ్బా అని ఆరా తీస్తే.. లేటెస్ట్ మూవీ కాటమరాయుడు సంగతులు బయటకొస్తాయి. డాలీ దర్శకత్వంలో రూపొందుతున్న కాటమరాయుడు మూవీలో చెర్రీకి నలుగురు తమ్ముళ్లు ఉంటారు. అన్నా దమ్ముల రిలేషన్ తో పాటు.. రాయలసీమ ఫ్యాక్షనిజం బేస్డ్ గా ఈ మూవీ నడుస్తుంటుంది.

అయితే..సెట్స్ లో పవన్ ఎలా ఉంటాడనే విషయాన్ని ఇప్పటికే చాలామంది తమ మాటల ద్వారా చెప్పారు. షాట్ అయిపోగానే వెళ్లిపోయి బుక్ చదువుకుంటూ ఉంటాడని.. ఎవరితోనూ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడని చెబుతుంటారు. కానీ పవర్ స్టార్ మాత్రం తనకు బాగా సన్నిహితులు అయిన వారితో బాగా కలిసిపోతాడు. ఇప్పుడు తమ్ముళ్లుగా కనిపిస్తున్న శివబాలాజీ తదితరులు షూటింగ్ టైంలో పవన్ కు బాగా క్లోజ్ అయిపోయారట. చివరకు సెట్స్ లో లంచ్ కూడా తమ్ముళ్లందరితో కలిసే చేస్తున్నాడటన పవన్ అన్నయ్య.

రీసెంట్ గా ఇలా అయిదుగురు సోదరులు కలిసి లంచ్ చేస్తున్న పిక్చర్ ఒకటి ఆన్ లైన్ లో ట్రెండింగ్ అయిపోతోంది. తను ఓ స్టార్ హీరో అనే ఫీలింగ్ ఏమాత్రం లేకుండా క్రూ అందరితో కలిసి కామన్ మ్యాన్ మాదిరిగా వ్యవహరించే తత్వం ఉండడంతోనే.. పవన్ తో సినిమా చేసేందుకు ఆర్టిస్టులు, టెక్నీషియన్లు తెగ ఉత్సాహం చూపించేస్తుంటారు మరి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/