Begin typing your search above and press return to search.

పదేళ్ల తర్వాత పవన్ కోసం..

By:  Tupaki Desk   |   10 May 2018 1:30 AM GMT
పదేళ్ల తర్వాత పవన్ కోసం..
X
పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలకు స్వస్తి పలికేసి.. రాజకీయాలపై ఫుల్లుగా ఫోకస్ పెట్టేశాడు. ఇంకా ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉంది కాబట్టి.. ఇలాంటి సమయంలో పవన్ అటు వైపు దృష్టి సారించడమే.. రాజకీయంగా మంచిదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇందుకు అజ్ఞాతవాసి చిత్రం ఫెయిల్యూర్ కూడా ఒక కారణం అయినా.. ఆ సినిమాతో సంబంధం లేని ఒక వ్యక్తికి.. అందరికంటే ఎక్కువగా ఆశాభంగం కలిగింది.

అతనెవరో కాదు.. కందిరీగ ఫేమ్ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. మైత్రీ మూవీస్ బ్యానర్ పై.. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో.. పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా రూపొందాల్సి ఉంది. తమిళ్ మూవీ తెరిని తెలుగులో రీమేక్ చేసేందుకు అంతా రెడీ అయిపోయింది. ఈ సినిమాకు 40 రోజుల కాల్షీట్స్ ఇస్తే చాలు.. 40 కోట్లు ముట్టచెప్పి మరీ మూవీ ఫినిష్ చేసేలా ప్లానింగ్ చేశారు. కానీ పవన్ ఈ మొత్తాన్ని కాదనుకుని మరీ పాలిటిక్స్ లోకి వెళ్లిపోవడంతో.. ఆరేడు నెలల పాటు వెయిట్ చేసిన సంతోష్ శ్రీనివాస్ పూర్తిగా డిజప్పాయింట్ అయ్యాడు.

కానీ మైత్రీ బ్యానర్ వాళ్లు ఇదే సబ్జెక్టును రవితేజ హీరోగా రూపొందించేలా సెట్ చేశారు. ఈ సందర్భంగా పవన్ నుంచి సంతోష్ శ్రీనివాస్ కు ఓ పర్సనల్ మెసేజ్ వచ్చింది. 'నీతో పని చేయలేకపోయినందుకు సారీ. రవితేజతో నీ నెక్ట్స్ సినిమా బాగా రావాలని ఆశిస్తున్నా' అనే అర్ధం వచ్చేలా సంతోష్ శ్రీనివాస్ కు మెసేజ్ చేశాడు పవర్ స్టార్.

అస్సలు ఏ మాత్రం ఊహించని విధంగా పవన్ నుంచి ఇలాంటి మెసేజ్ వచ్చేసరికి ఉబ్బితబ్బిబ్బయిపోతున్నాడట సంతోష్ శ్రీనివాస్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చినా.. మళ్లీ ఎప్పటికైనా సినిమాలు చేయాలని కోరుకుంటున్నానని.. పదేళ్ల తర్వాత అయినా సరే పవన్ సినిమా చేస్తానంటే.. అప్పటికప్పుడు మొదలుపెట్టేసేలా పవన్ కోసం స్క్రిప్ట్ సిద్ధంగా ఉంచుతానని చెబుతున్నాడట ఈ యంగ్ డైరెక్టర్.