Begin typing your search above and press return to search.
క్యాన్సర్ పీడిత అభిమానిని కలిసిన పవర్ స్టార్.. అందరి గుండెలు తాకిన పవన్ స్పందన!
By: Tupaki Desk | 10 March 2021 6:30 AM GMTపవన్ రాజకీయాలను పక్కన పెడితే.. ఆయనలోని మానవీత గురించి అందరికీ తెలిసిందే. సినిమా నటుడిగా ఉన్న కాలంలో ఆయన ఎంతో మందిని ఆదుకున్నారు. కష్టాల్లో ఉన్నామని ఎవరు తలుపు తట్టినా.. ఖచ్చితంగా ఆపన్నహస్తం అందిస్తారనే పేరుంది పవన్ కు. అంతేకాకుండా.. తన వద్దకు రాలేని అభిమానుల కోసం తానే వెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి.
ఇప్పుడు తాజాగా.. క్యాన్సర్ తో బాధపడుతున్న తన 19 ఏళ్ల అభిమాని వద్దకు వెళ్లారు పవన్. ఏపీలోని కృష్ణా జిల్లా పరిధిలోని లింగాల గ్రామానికి ఆయన వెళ్లారు. అక్కడ క్యాన్సర్ బాధపడుతున్న భార్గవ అనే తన అభిమానిని కలుసుకున్నారు. లేవలేని కండీషన్లో మంచం మీద ఉన్న అభిమానితో ఆత్మీయంగా మాట్లాడారు పవన్.
తన అభిమానికి రెండు చేతులతో నమస్కారం తెలిపిన పవన్.. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. భార్గవతోపాటు అతని కుటుంబ సభ్యులతోనూ మాట్లాడారు. వారితో కాసేపు గడిపారు. అనంతరం భార్గవ వైద్య ఖర్చుల నిమ్మిత్తం రూ.5 లక్షలు అందించారు. దాంతోపాటు వెండి గణేష్ ప్రతిమను అందించారు పవన్.
ఇప్పుడంటే రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి పవన్ సేవ వార్త అయ్యిందిగానీ.. రాజకీయాల్లోకి రానప్పుడు ఎవరికీ తెలియకుండా ఆయన చేసిన సేవలు చాలా ఉన్నాయి. పవన్ రాకతో తన అభిమాని భార్గవ లో కొత్త ఆశలు చిగురిస్తాయని.. కొత్త బలం పెంపొందుతుందని ఆశిస్తున్నారు కుటుంబ సభ్యులు.