Begin typing your search above and press return to search.
పవన్‌కు అతడిపై అంత నమ్మకమేంటో?
By: Tupaki Desk | 9 Jan 2016 5:30 PM GMTఅమీర్ ఖాన్ పెద్ద స్టార్ గా ఎదగకముందే రామ్ గోపాల్ వర్మ అతడితో ‘రంగీలా’ సినిమా తీశాడు. ఆ సినిమా పెద్ద హిట్టయి అమీర్ కు చాలా మంచి పేరు తెచ్చి పెట్టింది. ఐతే అంత మంచి హిట్టు ఇచ్చాడన్న కృతజ్నత ఏమీ పెట్టుకోలేదు అమీర్. కొన్నేళ్ల కిందట తనతో సినిమా చేయడానికి వర్మ అడిగితే.. మొహమాటం లేకుండా అతడికి నో చెప్పేశాడు అమీర్. కానీ మన దగ్గర పవన్ కళ్యాణ్ సంగతి చూడండి. తనకు ‘ఖుషి’ లాంటి మైల్ స్టోన్ మూవీ ఇచ్చాడన్న గ్రాటిట్యూడ్ తో ఎస్.జె.సూర్య పరిస్థితి ఏమీ బాగా లేకున్నా అతడితో ‘పులి’ సినిమా చేశాడు పవన్. అది పెద్ద డిజాస్టర్ అయింది. బ్లాక్ బస్టర్ హిట్టుకి డిజాస్టర్.. లెక్క సరిపోయిందిలే అనుకున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్.
కానీ ఇప్పుడు సూర్యకు పవన్ మరో ఛాన్స్ ఇవ్వడానికి రెడీ అవడమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సూర్య తమిళంలోనే సినిమాలు తీయడం బాగా తగ్గించేశాడు. అతడి సినిమాలు అక్కడ కూడా ఆడట్లేదు. ఏవో హీరో వేషాలు వేసుకుంటూ కాలం నెట్టుకొస్తున్నాడు. అలాంటిది పవన్ అతడితో మళ్లీ సినిమా చేయడానికి అంగీకరించడం చిత్రమే. ఐతే పవన్ కు సూర్య మీద ఎంత నమ్మకమంటే.. ‘పులి’ లాంటి డిజాస్టర్ తర్వాత కూడా సూర్య ఇచ్చిన ఓ కథను కోటి రూపాయలకు కొనుక్కుని బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మాణంలో రాజుసుందరం దర్శకుడిగా సినిమా చేయడానికి అంగీకరించాడు. అనివార్య కారణాల వల్ల అప్పట్లో ఆ ప్రాజెక్టు ఆగిపోయి.. ‘అత్తారింటికి దారేది’ మొదలైంది. ఐతే అప్పుడు పవన్ కు అమ్మబోయిన కథనే కొంచెం మార్చి ‘ఖుషి-2’ స్క్రిప్టు తీర్చిదిద్దిన సూర్య.. మరోసారి పవన్ ను కలిసి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడట. మొత్తానికి సూర్య మీద పవన్ కు మామూలు నమ్మకం లేదన్నటమాట.