Begin typing your search above and press return to search.

అసలు పవన్ సినిమా ఉన్నట్లా లేనట్లా?

By:  Tupaki Desk   |   6 Jun 2022 7:16 AM GMT
అసలు పవన్ సినిమా ఉన్నట్లా లేనట్లా?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ రావడంతో అభిమానులు చాలా అప్సెట్ అయ్యారు. ఇక తర్వాత మళ్ళీ సరికొత్తగా రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ కూడా పవన్ కు రాజకీయ పరిస్థితులు ఏమాత్రం అనుకూలించడం లేదు.

ఒకవైపు రాజకీయాల్లో మరో వైపు సినిమా షూటింగ్స్ అంటే చాలా తీవ్రమైన ఒత్తిడితో కూడుకున్నది. రెండింటిని బ్యాలెన్స్ చేయడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. పైగా ఒకేసారి నాలుగైదు ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టి వాటిని పూర్తి చేయడం కూడా పెద్ద టాస్క్ అనే చెప్పాలి.

ఇక ఆ తరహా లో పవన్ కళ్యాణ్ చాలా బిజీగా సినిమాలు చేస్తున్నప్పటికీ కూడా వాటిపై మధ్యలో ఎక్కడో ఒకచోట బ్రేకులు పడుతున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా మేకింగ్ విషయంలో కాస్త అప్సెట్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఆ సినిమా సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఏమాత్రం అంతా బాగా రావడం లేదు అని సినిమా పూర్తి చేసే అవకాశం లేదు అని కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.

అయితే ఈ క్రమంలోనే హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోయే సినిమా ఉంటుందా లేదా అనే వార్తలు కూడా చాలానే వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వలన ఒక సినిమా కోసం ఎక్కువ రోజులు ఉండే పరిస్థితి లేదు.

చాలా వేగంగా తన రాజకీయ ప్రణాళికలకు ఇబ్బందిగా లేకుంటేనే సినిమా షూటింగ్స్ చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ వినోదయా సీతం రీమేక్ చేసేందుకు ఒప్పుకున్నట్లు గా టాక్ వచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఆ సినిమాను ఆగస్టులో మొదలుపెట్టి సెప్టెంబర్లో తో ఫినిష్ చేయాలని పవన్ ఒక ప్లాన్ తో ఉన్నాడు. ఆ సినిమా కోసం కేవలం 25 రోజుల డేట్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కు మళ్లీ బ్రేక్ పడింది. అంతేకాకుండా హరీష్ దర్శకత్వంలో రాబోయే భవదీయుడు భగత్ సింగ్ ప్రాజెక్ట్ కూడా హోల్డ్ లో పడింది. ఇక పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ తో సినిమా చేసే అవకాశం లేదు అని ఆ ప్రాజెక్టు పై పవన్ అంతగా ఆసక్తి చూపడం లేదని కూడా చెబుతున్నారు. మరి ఈ టాక్ ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.