Begin typing your search above and press return to search.
పవన్ కొత్త ప్రాజెక్ట్ పోస్టర్ లో ఇవి గమనించారా?
By: Tupaki Desk | 4 Dec 2022 1:30 PM GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస ప్రాజెక్ట్ లని ప్రకటిస్తూ వస్తున్నారే కానీ వాటిని సెట్స్ పైకి తీసుకెళ్లడం లేదు. ఇప్పటికే క్రిష్ తెరకెక్కిస్తున్న `హరి హర వీరమల్లు` షూటింగ్ రాజకీయ మీటింగ్ ల కారణంగా ఆలస్యం అవుతూ వస్తోంది. ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ బిజీగా వుండటం వల్ల గత కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది. ఫైనల్ గా ఈ మూవీ షూటింగ్ చివరి షెడ్యూల్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇదిలా వుంటే ఈ మూవీతో పాటు పవన్ కల్యాణ్ `సాహో` ఫేమ్ సుజీత్ డైరెక్షన్ లో ఓ భారీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
ఈ ప్రాజెక్ట్ చేతులు మారుతోందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మేకర్స్ ఈ ప్రాజెక్ట్ పై ఆదివారం ఫుల్ క్లారిటీ ఇస్తూ సుజీత్ - పవన్ కల్యాణ్ ల ప్రాజెక్ట్ ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. They Call Him OG అంటూ క్యాప్షన్ ఇచ్చారు. పోస్టర్ లోనూ పలు ఆసక్తికరమైన అంశాలు వుండటంతో ఫ్యాన్స్ ఈ పోస్టర్ ని డీకోడ్ చేయడం మొదలు పెట్టారు. ఇంతకీ ఈ పోస్టర్ లో వున్న ఆసక్తికర అంశాలేంటీ? వాటి వెనకున్న కథేంటి? అన్నది ఇప్పడు చూద్దాం.
1. They Call Him OG ఇక్కడ ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని. సినిమాలో పవన్ ని అంతా ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని పిలుస్తారని, ఇందులో పవన్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడని క్యాప్షన్ ని బట్టి తెలుస్తోంది. .
2. పోస్టర్ లో పవన్ కల్యణ్ ఫోటోపై రాసి వున్న భాష.. జపనీస్. firestormisComming (అగ్నితుఫాన్ వచ్చేస్తోంది)
3. పవన్ కల్యాణ్ నిలబడి వున్న షాడో గన్ లా కనిపిస్తూ తనే పవర్ ఫుల్ గన్ అని స్పష్టం చేస్తోంది.
4. ఇక పవన్ కల్యాణ్ ముందున్న ఎల్లో కలర్ వృత్తాకారం.. జపాన్ జాతీయ జెండాను గుర్తు చేస్తోంది.
5. పోస్టర్ లో ఓ వైపు విగ్రహం ఆకారం కనిపిస్తోంది. అది జాపాన్ లోని అత్యంత ఎత్తైన బుద్దుడి విగ్రహం. ఇది ఆ దేశంలోని ఉషికు ప్రాంతంలో వుంది.
6. పోస్టర్ లో మరో వైపు చూస్తే మనదేశంలోనే గేట్ వే ఇండియా కనిపిస్తోంది.
సినిమాలో పవన్ కల్యాన్ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తారని తెలుస్తోంది. పోస్టర్ లో కనిపిస్తున్న ఈ కీలక అంశాల బట్టి చూస్తుంటే జపాన్, ముంబై నేపథ్యంలో సాగే కథ ఇదిని తెలుస్తోంది. డీవీవీ దానయ్య అత్యంత భారీ స్థాయిలో నిర్మించనున్న ఈ మూవీని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్ తో నిర్మించనున్నట్టుగా తెలుస్తోంది.