Begin typing your search above and press return to search.

రేణు కవితల్లో పవన్ లేడెందుకో

By:  Tupaki Desk   |   10 Dec 2018 10:38 AM GMT
రేణు కవితల్లో పవన్ లేడెందుకో
X
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ విడాకులు తీసుకున్నాక తన కొత్త భాగస్వామితో జీవితాన్ని పంచుకోబోతున్నట్టుగా గతంలోనే ప్రకటించిన సంగతి తెల్సిందే. అతను ఎవరో ఇప్పటిదాకా బయటి ప్రపంచానికి తెలియనివ్వకుండా గుట్టు మైంటైన్ చేసింది. తనలో మంచి కవయిత్రి ఉన్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు తన సోషల్ మీడియాలో కవితలను పోస్ట్ చేసే రేణు ఫైనల్ గా వాటికి ఒక పుస్తక రూపాన్ని ఇచ్చింది. ఏ లవ్ ఆన్ కండీషనల్ పేరుతో పబ్లిష్ చేసిన ఆ బుక్ ని తెలుగులో అనంత శ్రీరామ్ సహాయంతో అనువాదం చేయించింది రేణు.

సహజంగానే పవన్ ఫ్యాన్స్ లో దీని మీద ఆసక్తి కలుగుతుంది. అయితే కవితలను చదివాకా అందరికి కలిగిన అభిప్రాయం ఏంటంటే అందులో అణుమాత్రం పవన్ కళ్యాణ్ ప్రస్తావన కానీ అతనితో ఉన్న పన్నెండేళ్ల అనుబంధం గురించిన విశేషాలు కానీ ఏమి లేవట. కేవలం ప్రేమ గురించిన ఫీలింగ్స్ మాత్రమే అందులో ఉన్నాయి. అయితే రేణు దేశాయ్ ఓ పుస్తకం రాసింది కాబట్టి అందులో పవన్ కళ్యాణ్ ప్రస్తావన ఉండి తీరాలన్న రూల్ ఏమి లేదు. పైగా విడిపోయి ఉన్నారు. ఎవరికి వారు వ్యక్తిగత జీవితాన్ని కావాల్సిన రీతిలో ముందుకు తీసుకెళ్తున్నారు.

అలాంటప్పుడు రేణు బుక్ లో పవన్ గురించి ఎందుకు లేదు అనే సందేహం వెలిబుచ్చడం సరికాదు. అయితే పవన్ ఫ్యాన్స్ ఆ మధ్య జానీ షూటింగ్ లో వర్కింగ్ స్టిల్ ని షేర్ చేసుకున్న సంగతిని గుర్తు చేస్తున్నారు. అసలు పవన్ పేరే రాకూడదు అనుకున్నప్పుడు ఆ పిక్ ని ఎందుకు పోస్ట్ చేసినట్టు అని గుర్తు చేస్తున్నారు. ఏదైతేనేం రేణు దేశాయ్ రైటర్ గా కొత్త అవతారం ఎత్తింది. దర్శకురాలిగా ఆల్రెడీ ప్రూవ్ అయ్యింది కాబట్టి ఇప్పుడు రైటర్ గా కూడా మారిపోయింది.