Begin typing your search above and press return to search.
పొంగల్ కి తగ్గేదెవరో? నెగ్గేదెవరో?
By: Tupaki Desk | 17 Aug 2015 11:49 AM GMTఇప్పుడు టాలీవుడ్ హీరోలందరి టార్గెట్ ఒకటే. అదే మిషన్ హండ్రె డ్ క్రోర్స్. బాహుబలి ఎలాగూ ఆ మార్క్ ఎప్పుడో దాటేసింది. శ్రీమంతుడు అక్కడికి వెళ్లేందుకు రెడీగా ఉంది. ఇకపై రాబోయే స్టార్ హీరోలు కూడా... తమ సినిమాలకు ఇదే టార్గెట్ సెట్ చేసుకున్నారు. ఇందుకోసం ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న మూవీలు సంక్రాంతి సీజన్ ని లక్ష్యంగా నిర్ణయించుకున్నాయి. ఒకవైపు సెలవుల సీజన్ తో పాటు... సక్సెస్ సాధించేంచుకు సంక్రాంతి సెంటిమెంట్ కూడా. సాధారణంగా రెండు పెద్ద సినిమాలైనా పోటీ పడటం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈ మధ్య ట్రెండ్ మారింది.
సోలో రిలీజ్ లతోపాటు... రెండు వారాలపాటు ఎక్కువ రేట్లకు టికెట్స్ విక్రయిస్తేనే... ఈ లక్ష్యం అందుకోగలరనే విషయం బాహుబలి, శ్రీమంతుడులతో అర్ధమైంది. కానీ ఈ సారి సంక్రాంతికి మాత్రం పోటీ గట్టిగానే ఉండనుంది. పవన్, ఎన్టీఆర్, బాలయ్య... ముగ్గురూ తమ మూవీలను పొంగల్ కే తేవాలని పట్టుదలతో ఉన్నారు. మరి వందకోట్లంటే అసాధ్యం అయిపోనుంది ఈ ముగ్గురికీ. పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ మొదలుపెట్టేశాడు. జనవరి 10,11 తేదీల్లో సర్దార్ ని స్క్రీన్స్ పైకి తేవాలన్నది వీరి టార్గెట్. దీనికంటే ముందే ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తామని చెప్పాడు. జనవరి 8ని రిలీజ్ డేట్ గా సుకుమార్ గట్టి పట్టుదలతో ఉన్నాడు. ఇక బాలయ్య నటిస్తున్న 99వ సినిమా డిక్టేటర్ కూడా జనవరి 14రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు.
ఇలా 6రోజుల గ్యాప్ తో ముగ్గురు స్టార్లు రంగంలోకి వస్తే... వంద కోట్లు మార్క్ అందుకోవడం ఏ సినిమాకూ సాధ్యం కాదంటున్నారు టాలీవుడ్ పండితులు. కలెక్షన్స్, రికార్డ్ కావాలంటే.. సింగిల్ గానే బరిలోకి దిగాలనే విషయం స్పష్టమయిపోతోంది. పోటీ లేనిదే మజా ఏముంటుందని భావిస్తే మాత్రం.. అన్ని సినిమాలకూ నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. మరి ఈ పొంగల్ రేస్ నుంచి తగ్గేదెవరో ? నెగ్గేదెవరో ?