Begin typing your search above and press return to search.
అందరికీ ఆగస్ట్ 11 టార్గెట్.. ఎందుకో
By: Tupaki Desk | 31 March 2017 5:09 AM GMTగత కొంతకాలంగా సినిమాలన్నీ ముహూర్తం షాట్ సమయంలోనే.. ఉజ్జాయింపుగా రిలీజ్ డేట్ చెప్పేస్తున్నారు. ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉంటే ఇదేమీ అసాధ్యం కాదు. ముఖ్యంగా స్టార్ హీరోలయితే.. ఇలా డేట్ ను లాక్ చేసుకోవడం తప్పనిసరి అయిపోయింది. కానీ ఈ ఏడాది ఒక డేట్ విషయంలో మాత్రం చిన్నా పెద్దా స్టార్ అనే తేడాల్లేకుండా అందరూ తెగ పోటీ పడిపోతున్నారు. అదే ఆగస్ట్ 11.
పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ శ్రీనివాస్ ల దర్శకత్వంలో ప్రారంభం కానున్న మూవీకి.. మొదట ఆగస్ట్ 11 డేట్ నే చెప్పారు. అయితే.. షూటింగ్ 2 నెలలు ఆలస్యంగా మొదలవుతుండడం.. మధ్యలో నాలుగు నెలలు మాత్రమే గ్యాప్ ఉండడం.. పైగా త్రివిక్రమ్-పవన్ ఇద్దరూ నెమ్మదిగా సినిమాలు చేసేవాళ్లు కావడంతో.. ఇది ఎంతవరకూ సాధ్యమో చెప్పలేం.
ఎన్టీఆర్ జై లవ కుశ పరిస్థితి కూడా ఇంతే. ఫిబ్రవరిలోనే షూటింగ్ స్టార్ట్ చేసినా.. మార్చ్ మూడోవారానికి పనులు మొదలు కాలేదు. వీళ్లు చెప్పిన రిలీజ్ డేట్ కూడా ఆగస్ట్ పదకొండే. ఎన్టీఆర్ ట్రిపుల్ యాక్షన్ చేస్తుండడం అంటే.. విజువల్ ఎఫెక్ట్స్ కూడా అవసరం. అన్నీ పూర్తి చేసుకుని ఆగస్ట్ 11 కు వచ్చేయడం కాసింత కష్టం కావచ్చు.
ఇప్పుడు నితిన్-హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న లై(లవ్- ఇంటెలిజెన్స్- ఎనిమిటీ)కి కూడా ఇదే డేట్ చెప్పేస్తున్నారు. ఇంకా రెండున్నర నెలలు అమెరికాలో షూటింగ్ చేయాల్సి ఉంది.
ఇంతకీ ఈ ఆగస్ట్ 11కు ఎందుకంత క్రేజ్ అంటే.. అది కూడా సాధారణ శుక్రవారం మాత్రమే. కానీ ఆ వీకెండ్ పూర్తయ్యాక వరుసగా మరో రెండ్రోజులు పండుగ సెలవలు ఉన్నాయి. ఆగస్ట్ 14న కృష్ణాష్టమి పర్వదినం కాగా.. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం. అంటే.. 5 రోజుల పాటు ఫుల్ కలెక్షన్స్ రాబట్టేయచ్చు. సినిమాలో కంటెంట్ సరిగ్గా ఉండాలి కానీ.. సేఫ్ జోన్ కి వచ్చేసేందుకు ఈ 5 రోజులు సరిపోతాయ్. అందుకే ఆ డేట్ కి ఇంతటి డిమాండ్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/